Telugu News: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ పాక్ లో భారీ ర్యాలీలు.. భారత్ అప్రమత్తం

Read Time:  1 min
Pakistan
Pakistan
FONT SIZE
GET APP

పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరణించినట్లు మళ్లీ వార్తలు రావడంతో ఆయన పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ సైనికాధికారి ఆసిమ్ మునీర్ తెలిపినా.. 

Read Also: Ukraine: చిక్కుల్లో జెలెన్ స్కీ సర్కార్.. అవినీతిపై దర్యాప్తు

Pakistan
Pakistan Huge rallies in Pakistan to show Imran Khan.. India on alert

 పాక్ లో ఉద్రిక్తతల పరిస్థితులు 

తమ ప్రియతమ నాయకుడిని ఒకసారి చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అద్వాల జైలు వద్ద భారీ ర్యాలీలు నిర్వహిస్తుండడంతో పాక్ లో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. పాకిస్తాన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్ పై ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. నాలుగురోజుల క్రితం ఆయన మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు కూడా తమ సోదరుడిని చూపించాలి అంటూ మీడియాముందుకు వచ్చి వాపోయిన విషయం తెలిసిందే.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.