పెహల్గామ్‌లో పర్యాటకులను టార్గెట్ చేసిన మానవత్వంపై, కశ్మీరీలపై పాకిస్థాన్ (Pakistan)దాడి చేసినట్లు ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. జీవనోపాధి కోసం పర్యాటకం(Tourism)పై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాకిస్థాన్ దోచుకున్నదని తెలిపారు.
పెహల్గామ్‌లో పర్యాటకులను టార్గెట్ చేసి మానవత్వంపై, కశ్మీరీలపై పాకిస్థాన్ దాడి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. చీనాబ్ నదిపై బ్రిడ్జ్‌ను ఓపెనింగ్, వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపిన తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్ ఉన్నట్లు ఆయన ఆరోపించారు. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాకిస్థాన్ దోచుకున్నదని తెలిపారు.
పాకిస్థాన్ శత్రువు
పర్యాటకం ఇక్కడ ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించిందని, ప్రజల మధ్య అది ఒక బంధాన్ని ఏర్పర్చుకున్నదని, కానీ దురదృష్టవశాత్తు, పొరుగుదేశం మానత్వానికి, సామరస్యానికి, పర్యాటకానికి శత్రువుగా తయారైందని ఆరోపించారు. పాకిస్థాన్ పేదల కడుపు కొడుతున్నదని, ఏప్రిల్ 22న పెహల్గామ్‌లో జరిగింది అదే అని, పెహల్గామ్‌లో మానవత్వం, కశ్మీరతత్వంపై పాకిస్థాన్ అటాక్ చేసిందన్నారు. కశ్మీర్ ప్రజల ఆదాయాన్ని దోచుకునేందుకు టూరిస్టులపై పాక్ దాడికి పాల్పడిందన్నారు.
Read Also:Vande Bharat Express: చల్లటి వాతావరణం తట్టుకునే రీతిలో కాశ్మీర్ వందేభారత్ ట్రైన్