పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలలో అధ్యక్షులు, ప్రధానమంత్రులు అవినీతి చేస్తే వారికి మరణదండన లేక యాజ్జీవకారాగారశిక్షలు విధించడం పరిపాటే. ఇటీవలే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి ట్రిబ్యునల్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడం విధితమే. మయన్మార్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అంగసాన్ సూకీ ఎన్నికల చెల్లదంటూ, అక్కడి సైనిక పాలన ఆమెను గత కొన్ని సంవత్స రాలుగా నిర్భందంలోనే ఉంచారు. అలాగే ప్రస్తుతం పాకిస్థాన్లో అవినీతి ఆరోపణలతో 2023 నుంచి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుశిక్షను అనుభవిస్తున్నారు.
Read Also: Modi Bangladesh News : ఖలేదా జియా ఆరోగ్యంపై ప్రధాని మోదీ స్పందన
అయితే పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) హత్యకు గురయ్యారంటూ గత కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు ఆయన క్షేమంగా ఉన్నారంటూ ప్రభుత్వం చెబుతోంది. అలాగైతే తమకు చూపించాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన ముఖాన్ని చూపించలేదు. దీంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. క్షేమంగా ఉంటే ఎందుకు చూపించడం లేదని కుటుంబ సభ్యులు, మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. 2023, ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. అయితే నెలరోజుల నుంచి ఇమ్రాన్ ఖాన్ చూసుందుకు కుటుంబ సభ్యులు జైలు అధికారులను కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురయ్యాంటూ పుకార్లు వ్యాప్తి చెందాయి.
భారీ నిరసనలకు పిలుపు
తాజాగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మెగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. రావల్పిండిలో సమావేశాలు, సిట్-ఇన్లు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు చేయడాన్ని నిషేధిస్తూ పోలీసులు 144 సెక్షన్ విధించారు. డిప్యూటీ కమిషనర్ డాక్టర్ హసన్ వకార్ చీమా ఉత్తర్వు ప్రకారం సెక్షన్ 144 డిసెంబరు 1 నుంచి 3వ తేదీవరకు అనగా మూడురోజులు అమలులో ఉంటుందని పేర్కొంది. అయితే పోలీసుల తీరును తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తప్పుపట్టింది. ఇమ్రాన్ ఖాన్ను ఎందుకు కలవనివ్వడం లేదని నిలదీస్తున్నారు. కనీసం ఆయన కుటుంబ సభ్యులను కూడా కలవనీయకుండా అడ్డుకుంటున్నారని పార్టీ మద్దతుదారులు వాపోతున్నారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: