పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంతకాలం చుక్కనీరు ఇచ్చేది లేదని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) చెప్పారు.బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ రక్తం, నీరు కలిసి ప్రవహించవని, ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడం,నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక దేశం తనప్రధాన నదులను ఆ నదిపై హక్కులు లేకుండా మరొక దేశానికి,ప్రవహించడానికి అనుమతించిన ఒప్పందం ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి ఇది ఒక అసాధారణ ఒప్పందం, మనం దానిని నిలిపివేసినప్పుడు, ఈ సంఘటన చరిత్రను గుర్తుచేసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. బహుషా వారు చారిత్రక విషయాలను మర్చిపోయినట్లు ఉన్నారంటూ పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు జైశంకర్.
1960 ఒప్పందంపై జైశంకర్ విమర్శలు
ఈ ఒప్పందం గురించి 1960లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రకటనపై జైశంకర్ విమర్శించారు. 1960నవంబర్ 30న ఈ సభ నీటి సరఫరా లేదా ఇవ్వాల్సిన డబ్బు పరిమాణాన్ని నిర్ణయించాలా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆయన (నెహ్రూ) అన్నారు. ప్రజలు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి (Prime Minister) కూడా పాకిస్తాన్ పంజాబ్ ప్రయోజనాల కోసం ఈ ఒప్పందాన్ని చేయనివ్వండి అని అన్నట్లు గుర్తుచేశారు. ఆర్టికల్ 370 సరిదిద్దాం, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తన మద్దతును నిలిపివేసినంత వరకు సింధుజల ఒప్పందం నిలిపివేస్తామంటూ,కుండ బద్దలు కొట్టారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని మేం హెచ్చరించాం అంటూ పాకిస్థాన్ కు మరోసారి గట్టిగా,భారత్ హెచ్చరించింది. నీరు నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల గుండా వెళ్లింది. అయితే ఇటీల ఆదేశంలో,భారీగా వర్షాలు వచ్చాయి.
సింధు నీటి ఒప్పందం అంటే ఏమిటి?
ఒప్పందం ప్రకారం, భారతదేశం పశ్చిమ నదుల నీటిని గృహ అవసరాలకు, నిల్వ, నీటిపారుదల ,విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం సింధు నదీ వ్యవస్థ నుండి 20% నీటిని భారతదేశానికి,మిగిలిన 80% పాకిస్తాన్‌కు ఇస్తుంది.
ప్రపంచంలో అతిపెద్ద నది ఏది?
ప్రపంచంలోనే అతి పెద్ద నది అమెజాన్ నది. ఇది నీటి విడుదల పరంగా ప్రపంచంలోనే అతి పెద్దది, పొడవు పరంగా నైలు నదితో వివాదంలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Farmers : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ-పియం కిసాన్ నిధులు జమ