📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Rajnath : గట్టి బదులు చెబుతాం

Author Icon By Digital
Updated: April 24, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం దాడిపై రాజ్ నాథ్ స్పందన

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమని, దాడికి గట్టి బదులిస్తామని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన బుద్ధి చెబుతామన్నారు. పహల్గాం ఘటనపై శ్రీనగర్లో భద్రతా చర్యలపై ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠితో చర్చించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలోనూ రాజ్ నాథ్ పాల్గొననున్నారు.

Rajnath : గట్టి బదులు చెబుతాం

పహల్గాం దాడిపై రాజ్ నాథ్ స్పందన: ఉగ్రవాదానికి గట్టి బదులు చెబుతాం

ఇటీవలి దాడి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా భావిస్తున్నారు. గతంలో కూడా పుల్వామా దాడిలో ఒకే విధమైన విధానం అమలులోకి తెచ్చారు. ఉగ్రవాదులు సాధారణ పర్యాటకులపైనే దాడులు జరిపిన కారణంగా ఇది పాక్ ప్రేరేపిత కుట్రగా అనుమానిస్తున్నారు.ఈ దాడి అనంతరం భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో భద్రతను మరింత కఠినంగా చేసింది. సైనికుల సంఖ్యను పెంచడంతో పాటు డ్రోన్, నైట్ విజన్ టెక్నాలజీ వంటి ఆధునిక పరికరాలతో నిఘా పెంచారు. అంతేకాదు, యాత్రలపై కూడా సెక్యూరిటీ ప్రొటోకాల్‌లను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

Read More :
Terror Attack : పాక్‌పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత

Army Action Breaking News in Telugu Indian Defence jammu kashmir Kashmir Violence Pahalgam Attack Pak Conspiracy Paper Telugu News Rajnath Singh Telugu News Telugu News online Telugu News Today Terrorism in India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.