వక్ఫ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో తాల్కటోరా స్టేడియంలో జరిగిన వ్యతిరేక వక్ఫ్ బిల్లు సభలో ఆయన కేంద్రాన్ని ఆగ్రహంగా విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై కూడా విమర్శలు గుప్పించారు.సభలో మాట్లాడిన ఓవైసీ, ప్రధాని మోదీ సౌదీ అరేబియాలో యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ‘యా హబీబీ’ అంటూ మైత్రీగా పలకరిస్తారని అన్నారు. కానీ అదే వ్యక్తి దేశానికి తిరిగొచ్చిన వెంటనే ప్రజలకు “దుస్తుల ఆధారంగా ముస్లింలను గుర్తించండి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారని ఆరోపించారు. ఇది ప్రధాని తలెత్తించాల్సిన విషయం అని పేర్కొన్నారు.
‘వక్ఫ్ లేని ముస్లిం దేశం ఒక్కటీ లేదు’
ఓవైసీ ఆరోపించిన ప్రధాన విషయం మాత్రం ఇదే – బీజేపీ నేతలు ముస్లిం దేశాలలో వక్ఫ్ ఉండదని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. “మీ సౌదీ పర్యటనలో మదీనాను చూసే సమయంలో అక్కడి యువరాజుని అడగండి – మదీనా వక్ఫ్ భూమి కాదా? అంటూ ఓవైసీ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశమైనా, రాచరికమైనా… ప్రతి ముస్లిం దేశంలో వక్ఫ్ వ్యవస్థ ఉందని స్పష్టంచేశారు.
2013 వక్ఫ్ చట్టం గురించి గుర్తు చేసిన ఓవైసీ
2013లో వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఓవైసీ తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి అధికారాన్ని దుర్వినియోగం చేసినా, న్యాయవ్యవస్థకు జోక్యం చేసుకునే హక్కు ఉంది. న్యాయవ్యవస్థే లేకపోతే మేమెక్కడకు వెళ్ళాలి? అంటూ ఓవైసీ ప్రాశ్నికంగా వ్యాఖ్యానించారు. అధికారాల విభజన రాజ్యాంగానికి అర్థం, దానిని తక్కువ అంచనావేయలేమన్నారు.ఇటీవల ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ “పార్లమెంటే సర్వోన్నతం” అని చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్రంగా స్పందించారు. “ధన్‌ఖర్‌కు పరిమిత అవగాహన ఉంది. పార్లమెంట్ స్వతంత్ర సంస్థే, కానీ న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలూ అదే స్థాయిలో స్వతంత్రమైనవే. మన రాజ్యాంగం అధికారాల విభజనను స్పష్టంగా పేర్కొంది,” అని తెలిపారు.
చట్టం చుట్టూ సత్యం తిరుగుతుంది కాద – ఓవైసీ
మీరు రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు చేస్తే, న్యాయవ్యవస్థ ఖచ్చితంగా దానిపై జోక్యం చేసుకుంటుంది. ఇది రాజ్యాంగానికి భాగంగా ఉన్న నిజం, అని ఓవైసీ తేల్చిచెప్పారు. వక్ఫ్ చట్టం మార్పులు ముస్లింల హక్కుల్ని కాపాడడం కాదు, కించపరచడమే అని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : PM Modi :మోదీ విమానానికి సౌదీ జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ తో అరుదైన స్వాగతం