📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Operation Thrashi-1: కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

Author Icon By Aanusha
Updated: February 24, 2026 • 12:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Operation Thrashi-1: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్‌లోని కిష్టవాడ్ జిల్లాలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాయి. సుమారు 326 రోజుల పాటు అత్యంత గోప్యంగా, పకడ్బందీగా నిర్వహించిన ‘ఆపరేషన్ త్రాషి-1’ విజయవంతంగా ముగిసింది. ఈ సుదీర్ఘ పోరాటంలో పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు కరడుగట్టిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

Read also: Gee Geronimo Snail: గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

పాకిస్థాన్ సైన్యం నుంచి శిక్షణ పొందిన ఈ ఉగ్రవాదులు.. భారత భధ్రతా బలగాల నుంచి తప్పించుకోడానికి క్లిష్టమైన పర్వతాలను, దట్టమైన అడవులను ఉపయోగించుకునేవారు. దాదాపు ఏడాది పాటు ఆపరేషన్ సైట్‌లోనే భద్రతా దళాలు ఉండిపోయాయంటే వారి సంకల్పం ఏంటో అర్ధమవుతుంది. తరచూ ఎన్‌కౌంటర్‌లు జరిగేవి, కానీ ఉగ్రవాదులు తప్పించుకుని అడవుల్లోకి పారిపోయేవారు. ఆ ప్రాంతంలో మైదానాలు, రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆపరేషన్ సవాల్‌గా మారింది.

ఆదివారం ఉదయం జైషే మహమ్మద్ టాప్ కమాండర్ పాకిస్థాన్ ఉగ్రవాది సైఫుల్లాహ్‌ను హతమార్చాయి. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాంతంలో తప్పించుకుని తిరుగుతున్న అతడు 20 సార్లు సైన్యం కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. 2016లో సైన్యం హతమార్చిన హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ మాదిరిగానే సైఫుల్లా భద్రతా దళాలను ఇబ్బంది పెట్టడానికి, కశ్మీర్ లోయలో అలజడి సృష్టించడానికి అన్ని వ్యూహాలను ప్రయత్నించాడు. అతడ్ని కాల్చి చంపడంతో ఉగ్రవాద నెట్‌వర్క్ ధ్వంసమైంది.

‘Operation Thrashi-1’, which lasted for 326 days in Kishtwar, was a success

సైనిక నిఘా కీలక పాత్ర పోషించాయి

మంచు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షిష్టమైన ఛాత్రూ రీజియన్‌లో పర్వతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్‌కు ఇండియన్ ఆర్మీ వైట్‌ నైట్ కార్ప్స్ నాయకత్వం వహించింది. సైనికుల శౌర్యం, దృఢ సంకల్పంతో పాటు ఆర్మీ, జమ్మూ కశ్మీర్ స్పేషల్ ఆపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ అద్భుతమైన సమన్వయం ఆపరేషన్ విజయానికి దోహదపడింది. స్థానిక నివాసితుల మద్దతు, ఖచ్చితమైన సైనిక నిఘా కీలక పాత్ర పోషించాయి.

అలాగే, ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV) డ్రోన్లు, మానవరహిత వాహనాలు, శాటిలైట్ ఇమేజనరీ సహా అత్యాధునిక సాంకేతికతను సైన్యం ఈ ఆపరేషన్‌కు వినియోగించింది. దృఢమైన, అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఆపరేషన్‌కు తోడ్పడింది… సైనికులు అన్ని పరిస్థితులలోనూ కనెక్ట్ అయ్యారు. ‘‘ఉగ్రవాద నెట్‌వర్క్‌కు భారీ దెబ్బ.. మేము సేవ చేస్తాం.. మేము రక్షిస్తాం’ అని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Jaish-e-Mohammed Terrorists Killed Jammu Kashmir Security Forces Success Kishtwar Terrorist Encounter Operation Thrashi-1

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.