📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Operation Sindoor : ఆపరేషన్ సింధూర్‌లో మహిళా అధికారిణుల చరిత్ర

Author Icon By Digital
Updated: May 8, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళా అధికారిణులు చరిత్ర సృష్టించిన ఆపరేషన్ సింధూర్: కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాలు

జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ, పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై ప్రతీకార దాడి నిర్వహించింది. ఈ చర్యను ‘ఆపరేషన్ సింధూర్’గా నామకరణం చేయగా, దాదాపు 100 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో హతమయ్యారని సమాచారం. ఈ ఆపరేషన్ వివరాలను బుధవారం ఉదయం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ మీడియాకు వెల్లడించారు. అతనితో పాటు ఇద్దరు మహిళా అధికారిణులు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొని ఆపరేషన్ వివరించారు. ఇదే తొలిసారి భారత చరిత్రలో ఇద్దరు మహిళా అధికారి, రక్షణ ఆపరేషన్‌లపై అధికారికంగా మీడియా సమావేశానికి నాయకత్వం వహించారు.ఈ ఇద్దరు అధికారి ఎవరు? వారిపైనే ప్రస్తుతం యావత్ భారత్ ఆసక్తిగా గూగుల్‌లో శోధిస్తోంది. కర్నల్ సోఫియా ఖురేషి గుజరాత్‌కు చెందినవారు. 1990లో భారత సైన్యంలో చేరిన ఆమె కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు. 2016లో పుణెలో జరిగిన మల్టినేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ‘ఫోర్స్ 18’లో భారత బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి గానూ చరిత్ర సృష్టించారు. ఈ కార్యాచరణలో 18 దేశాలు పాల్గొన్నా, కేవలం భారత్ బృందానికి మాత్రమే మహిళా అధికారి నాయకత్వం వహించడమొక విశేషం. అంతేకాకుండా, 2006లో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్‌లో భాగంగా కాంగోలో సేవలందించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఆమెకు మూడు దశాబ్దాలకు పైగా సైన్యంలో అనుభవం ఉంది.

Operation Sindoor : ఆపరేషన్ సింధూర్‌లో మహిళా అధికారిణుల చరిత్ర

Operation Sindoor ; ఆపరేషన్ సింధూర్‌లో మహిళా అధికారిణుల చరిత్రాత్మక పాత్ర

ఇక వ్యోమికా సింగ్ విషయానికి వస్తే, ఆమె ఓ నిబద్ధత కలిగిన పైలట్. పైలట్ కావాలన్నదే ఆమె చిన్ననాటి కల. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆ కలను సాకారం చేసేందుకు ఆమె 2004లో ఏయిర్ ఫోర్స్‌లో చేరారు. 2017లో వింగ్ కమాండర్ హోదా పొందిన ఆమె, 2019 డిసెంబర్‌లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదాకు ఎదిగారు. క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపిన వ్యోమికా అనేక విజయాలను సాధించారు. హైరిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్లలో ఆమెకు ఉన్న నైపుణ్యం భారత వైమానిక దళంలో గుర్తింపు తెచ్చింది.ఈ ఇద్దరు మహిళా అధికారిణులు కేవలం ఆపరేషన్ వివరించడమే కాదు, భారతదేశ మహిళా శక్తిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పారు. దేశ భద్రతలో మహిళల పాత్ర ఎంత ప్రాముఖ్యతగలదో వీరి సేవలు స్పష్టంగా చూపుతున్నాయి. ఈ సందర్భంగా వారు దేశ యువతను సైన్యంలో చేరాలని ప్రోత్సహిస్తున్నారు. ఇవే మహిళల ఆకాంక్షలకు దిశానిర్దేశం చేసే స్ఫూర్తిదాయక ఘట్టాలు.

Read More : Operation Sindhur: ‘ఆపరేషన్ సిందూర్’ పై అంతర్జాతీయ మీడియా స్పందన

Army Women Leadership Breaking News in Telugu Colonel Sophia Qureshi Google News in Telugu India-Pakistan Indian Air Force Indian Army Latest News in Telugu Operation Sindhoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Wing Commander Vyomika Singh Women in Defence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.