స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను అధిగమించిందని ఆమె కొనియాడారు. మన రాజ్యాంగం ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణ దళాల పోరాట పటిమను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశ భద్రత కోసం మన సైనికులు ఎలాంటి పరిస్థితులకు అయినా సిద్ధంగా ఉంటారని ‘ఆపరేషన్ సిందూర్’ మరోసారి రుజువు చేసిందని ఆమె అన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది
ఆపరేషన్ సిందూర్’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఆర్మీ జరిపిన ఈ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ రక్షణ దళాల ధైర్యసాహసాలకు, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలొడ్డిన సైనికుల త్యాగాలను ఆమె స్మరించుకున్నారు.
దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత
రాష్ట్రపతి తన ప్రసంగంలో దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ వంటి విజయాలు భారత సాయుధ దళాల బలం, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయన్నారు. దేశ ప్రగతి, భద్రత ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, ఈ రెండింటినీ ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలంతా దేశ భద్రతకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.
Read Also : Leander Paes: లియాండర్ పేస్ కు పితృ వియోగం!