📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Operation Sindoor : ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’పై అద్భుత‌మైన సైక‌త శిల్పాన్ని మ‌లిచిన సైక‌త శిల్పి

Author Icon By Divya Vani M
Updated: May 8, 2025 • 7:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశాకు చెందిన ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పాట్నాయక్‌ ‘ఆపరేషన్ సిందూర్‌’పై తాను రూపొందించిన అద్భుత శిల్పంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పూరీ తీరాన ఆరు అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ సైకత శిల్పంలో, భరతమాత నుదుటిపై ఉన్న సింధూరం శక్తిగా మారి శత్రువుల్ని ఎలా వినాశనం చేసిందో ప్రతిబింబించారు.“భారత్ మాతా కీ జై.. న్యాయం లభించింది” అనే శీర్షికతో పాట్నాయక్‌ ఈ శిల్ప వీడియోను తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు తనదైన శైలిలో స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇది అకస్మాత్తుగా వచ్చిన స్పందన కాదు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

Operation Sindoor ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’పై అద్భుత‌మైన సైక‌త శిల్పాన్ని మ‌లిచిన సైక‌త శిల్పి

ఈ దారుణానికి ప్రతీకారం తీర్చేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి బుధవారం ఉదయం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది.జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ప్రధాన ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ఉగ్ర శిబిరాలను ఈ దాడిలో నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్‌ ఫలితంగా దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ గురువారం అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు.భారత భద్రతా దళాల దూకుడు, దేశం తీసుకున్న చొరవపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న తరుణంలో, సుదర్శన్ పాట్నాయక్ రూపొందించిన ఈ శిల్పం దేశ భక్తిని ప్రతిబింబిస్తూ అందరి మనసులను ఆకట్టుకుంటోంది. ఆయన కళ మరోసారి దేశం పట్ల అంకితభావాన్ని ప్రతిభాటిస్తూ పాజిటివ్ సందేశాన్ని వెలిబుచ్చుతోంది.

Read Also : Operation Sindoor : పాక్ జెండాలు పీకేస్తోన్న బలోచ్ వాసులు..ఎందుకంటే!

Bharat Mata sculpture India Pakistan conflict Indian Army Airstrike Operation Sindoor Pahalgam Terror Attack Pakistan Terror Camps PoK airstrike Sudarsan Pattnaik sand art

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.