📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Dushyant Singh : ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

Author Icon By Sai Kiran
Updated: December 15, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dushyant Singh : చైనా, టర్కీ మద్దతుతో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తుండటంతో భారత్‌కు మరోసారి సైనిక ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుష్యంత్ సింగ్ హెచ్చరించారు. కశ్మీర్ అంశాన్ని అడ్డం పెట్టుకుని పాకిస్థాన్ తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతోందని, ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ తప్పదనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత సాయుధ దళాలు ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్ (CLAWS) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న దుష్యంత్ సింగ్, గుజరాత్‌లోని సౌత్‌వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని ఆయన మండిపడ్డారు.

Read also:Akilesh Yadav: యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

“ఆపరేషన్ సిందూర్ ఒక ముగింపు కాదు. అది (Dushyant Singh ) యుద్ధ నిర్వహణలో ఒక కొత్త దశకు ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో కూడా శత్రువులతో ఘర్షణలు తప్పవు. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం ఎంత త్వరగా సిద్ధమైతే అంత మంచిది” అని దుష్యంత్ సింగ్ పేర్కొన్నారు. 1971 యుద్ధం తర్వాత తొలిసారిగా భారత త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేసిన ఉదాహరణ ఆపరేషన్ సిందూర్ అని ఆయన గుర్తు చేశారు.

అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో దేశం ఇంకా వెనుకబడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై సైబర్ దాడులు ఏకంగా ఏడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఒక్క నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌పైనే దాదాపు 40 కోట్ల సైబర్ దాడులు జరిగాయని తెలిపారు.

సైబర్ దాడులు, ఫేక్ న్యూస్‌ను ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రక్షణ రంగానికి జీడీపీలో కనీసం 3 శాతం నిధులు కేటాయించాలని, నిఘా వ్యవస్థను ఆధునీకరించాలని దుష్యంత్ సింగ్ సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu China Turkey Pakistan support cyber attacks India defence budget GDP Dushyant Singh Google News in Telugu India Pakistan tension Indian Army preparedness Indian defence news kashmir issue Latest News in Telugu military operation India Operation Sindoor 2.0 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.