భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindhoor) పాకిస్థాన్‌పై సైనికంగానే కాదు, ఆర్థికంగా కూడా భారీ ఒత్తిడి తెచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి(K Tripathi) తెలిపారు. క్యారియర్ యుద్ధ సమూహాన్ని మోహరించడంతో పాకిస్థాన్ నేవీ తమ నౌకలను పోర్టులకే పరిమితం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
Read Also: Komatireddy: ఎమ్మెల్యే సూచనలతో మద్యం షాపుల నియంత్రణ
ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభం
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో పాక్‌కు వచ్చే వాణిజ్య నౌకల రాక తగ్గి, వాటి భీమా వ్యయం పెరగడంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడిందని తెలిపారు.
పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నేవీ పశ్చిమ సముద్ర ప్రాంతాల్లో పహారా మరింత కట్టుదిట్టం చేసింది. పాకిస్థాన్ మళ్లీ దాడులకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభం తప్పదని కేంద్రం ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: