‘ఆపరేషన్ కగార్’( Operation Kagar) అమలు తర్వాత మావోయిస్టుల సెంట్రల్ కమిటీలో భారీ నష్టాలు నమోదు అవుతున్నాయి. కేవలం ఐదు నెలల్లో ఐదుగురు టాప్ లీడర్లు హతమవడం ఆర్గనైజేషన్ శక్తిని గణనీయంగా దెబ్బతీసింది. ఇటీవల మృతి చెందిన వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా వంటి ముఖ్య సభ్యులు ఉన్నారు.
Read Also: Vijayawada news : విజయవాడ ఆటోనగర్‌లో 28 మంది మావోయిస్టుల అరెస్ట్…
లొంగిపోయిన కీలక నాయకులు – బలహీనమవుతున్న శక్తి
అంతేకాకుండా సంస్థలోని మరో పలువురు ప్రాముఖ్యమైన నేతలు ప్రభుత్వానికి లొంగిపోయారు. అందులో
- మల్లోజుల వేణుగోపాల్,
- ఆశన్న,
- చంద్రన్న
తదితరులు ఉన్నారు. ఈ పరిణామాలతో మావోయిస్టు టాప్ లెవల్ నిర్మాణం మరింత కుంచించుకుపోతోంది. - కమిటీకి చెందిన కొందరు సభ్యులు పశ్చిమ బెంగాల్లో ఆశ్రయం తీసుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో తెరలేని ప్రాంతాల్లో వారు దాక్కుంటున్నట్లు సమాచారం.
హిడ్మా హత్యతో మరింత బలహీనత
ఇటీవల ప్రముఖ కమాండర్ హిడ్మా మృతి చెందడంతో మావోయిస్టుల( Operation Kagar) కేంద్ర నాయకత్వం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ నేతను కోల్పోవడం సంస్థ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :