గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో (At Ahmedabad Airport) గురువారం ఒక విషాదకర సంఘటన జరిగింది. లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది.మధ్యాహ్నం 1:39 గంటలకు 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో విమానం బయలుదేరింది. కానీ కేవలం 30 సెకన్లకే భారీ శబ్దం వినిపించి అది నేలకొరిగింది. దీంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన మొదలైంది.ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ (Vishwas Kumar Ramesh) అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి ఛాతీ, కళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను అసర్వా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

శబ్దం వినిపించగానే కూలిపోయింది
విమానమొచ్చిన వెంటనే భారీ శబ్దం వినిపించింది. ఆ తర్వాత కూలిపోయింది. నేను లేచి చూస్తే చుట్టూ మృతదేహాలే. నన్ను ఎవరో అంబులెన్స్‌కి తీసుకెళ్లారు అని విశ్వాస్ తన అనుభవం గురించి చెప్పారు.
సోదరుడి ఆచూకీ తెలియక కన్నీళ్లు
విశ్వాస్‌తో కలిసి అతని సోదరుడు అజయ్ కుమార్ రమేష్ కూడా ప్రయాణిస్తున్నాడు. కానీ ప్రమాదం తర్వాత అతడి ఆచూకీ ఇంకా తెలియలేదు. అతడి కోసం వెతకండి. అంటూ విశ్వాస్ కన్నీటి పర్యంతమయ్యాడు.విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడియన్ కూడా ఉన్నట్టు ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన
ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్విగ్నత నెలకొంది. మృతుల వివరాలు తెలియక బంధువులు తీవ్ర ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కళ్ళలో ఆశతో బంధువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా కొన్ని కుటుంబాలకు తమవారి ఆచూకీ తెలియక బాధ ఎదురవుతోంది.
Read Also : Ahmedabad plane crash : ప్లేన్ క్రాష్ : ఈవెంట్ రద్దు చేసుకున్న సల్మాన్ ఖాన్