Hindu woman rape : బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ మహిళపై దారుణం

Read Time:  1 min
Hindu woman rape : బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ మహిళపై దారుణం
FONT SIZE
GET APP

బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి మానవత్వాన్ని ప్రశ్నించే దారుణానికి వేదికైంది. కుమిల్లా జిల్లా మురాద్‌నగర్‌లో ఓ హిందూ మహిళపై ఘోరంగా (Hindu woman rape) అత్యాచారం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నిందితుడు తలుపులు పగలగొట్టి లోనికి చొరబడి ఆమెపై నరరూప రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు.బాధితురాలి భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. హరిసేవ పండుగను పురస్కరించుకుని ఆమె ఇద్దరి పిల్లలతో పుట్టింటికి వచ్చింది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో ఆమె తండ్రి ఫజర్ అలీ అనే వ్యక్తి వద్ద రూ.35 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరగచెప్పే గడువు పూర్తవడంతో జూన్ 26 రాత్రి 10 గంటల సమయంలో ఫజర్ అలీ వారి ఇంటికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెను బెదిరించి, దాడికి పాల్పడ్డాడు.

వివస్త్రంగా చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు

తలుపులు బద్దలుగొట్టి లోనికి ప్రవేశించిన ఫజర్ అలీ ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెను బలవంతంగా వివస్త్రం చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలు ప్రాణాల కోసం వేడుకున్నా, నిందితుడు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడు.ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో బాధితురాలు కొట్టొద్దని వేడుకుంటున్న దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ వీడియోలతో దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది.

ధాకా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిరసనలు

ఘటనపై స్పందించిన ధాకా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మహిళలపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.ఫజర్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అత్యాచారం, దాడి, బెదిరింపు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసును విచారిస్తున్నారు. బాధితురాలికి వైద్య సాయం అందించబడుతోంది.

Read Also : PAN Card : పాన్ కార్డు, క్రెడిట్ కార్డు, రైలు టికెట్లపై కీలక మార్పులు!

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.