📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Onam 2025 Festival – కేరళలో ఘనంగా జరగుతున్న ఓనం పండుగ ఉత్సవాలు

Author Icon By Anusha
Updated: September 5, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళ రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో ఓనం (Onam) అతి ప్రధానమైనది. ఈ పండుగ కేరళ సంస్కృతికి ప్రతిబింబం మాత్రమే కాకుండా, అక్కడి జీవన విధానానికి అద్దం పడుతుంది. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు పండుగలు ఎంత ముఖ్యమో, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి ఎంత ప్రాధాన్యత కలిగిందో, తమిళనాడులో దీపావళి ఎంత విశిష్టమో, అదే స్థాయిలో కేరళ ప్రజలకు ఓనం అనేది గౌరవనీయమైన పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం భక్తి, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

ఓనం పండుగను సాధారణంగా “కేరళ రాష్ట్ర ఉత్సవం” అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా వ్యవసాయ పండుగగా ప్రసిద్ధి చెందింది. పంటలు పండిన అనంతరం కృతజ్ఞతా భావంతో జరుపుకునే ఈ పండుగలో కేరళ సంస్కృతి సంప్రదాయాలు (Cultural traditions of Kerala) విస్తారంగా కనబడతాయి. కేరళ ప్రజల మట్టి వాసన, గ్రామీణ జీవన శైలి, సహజసిద్ధమైన ఆనందాలు అన్నీ ఈ ఉత్సవంలో ప్రతిబింబిస్తాయి.ఈరోజు (సెప్టెంబర్‌ 5) వ తేదీన జరుపుకోనున్నారు.

ఈ పండుగ సందర్భంగా నృత్యాలు

మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళ ప్రజలు ఓనం పండుగని ఘనంగా జరుపుకుంటారు. కేరళ రాష్ట్ర ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలకు వారసత్వంగా ఈ ఓనం పండగను సుమారు 10 రోజుల పాటు వేడుకగా నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా నృత్యాలు, విందు భోజనాలు, పులివేషాలు, ఆటపాటలు, ప్రాచీన విద్యలు వంటివి కన్నుల పండుగగా వైభవోపేతంగా జరుగుతాయి. ఇక ఈ ఓనం పండుగ‌ను కేరళ ప్రజలే కాకుండా త‌మిళ‌నాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కుడా ఘనంగా జరుపుకుంటుంటారు.వామనుడి అవతారంలో పాతాళంలోకి వచ్చిన విష్ణుమూర్తి చేత అణిచివేయబడ్డ బలిచక్రవర్తి ఒక కోరిక కోరుతాడు.

అప్పుడు బలి చక్రవర్తి కోరిక మేరకు విష్ణుమూర్తి ఒక వరమిస్తాడు. అదేమిటంటే.. ప్రతి ఏడాది బలి చక్రవర్తి తన ప్రజలను చూసేందుకు, కలుసుకునేందుకు వచ్చేలా వరమిస్తాడు. ఆ వరంతో బలి చక్రవర్తి ఓనం పండుగ రోజున తన ప్రజలను కలుసుకొనేందుకు ఆత్మరూపంలో భూమిపైకి వస్తాడని కేరళీయుల ప్రగాఢ నమ్మకం. అలా భూమిపైకి వచ్చిన బలి చక్రవర్తిని తమ ఇళ్లలోకి ఆహ్వానించడానికే ఈ ఓనం పండగను వైభవంగా జరుపుకుంటారు.

మొదటి రోజు ప్రారంభమయ్యే ఉత్సవాలు 10వ రోజున తిరు ఓనంతో ఘనంగా ముగుస్తాయి

మొదటి రోజు ప్రారంభమయ్యే ఉత్సవాలు 10వ రోజున తిరు ఓనంతో ఘనంగా ముగుస్తాయి. అలాగే.. ఈ ఓనం పండగలో చివరి రోజైన తిరు ఓనం సందర్భంగా పచ్చని ఆకులో 20 రకాల వంటకాలు, పిండి వంటలు, పాయసం, ఊరగాయలు, అప్పడం వంటి వాటితో ఓన సధ్య పేరుతో సామూహిక విందు భోజనాలు స్వీకరిస్తారు. ఈ సామూహిక విందు భోజనాల సమయంలో చాపపై కూర్చుని అరటి లేదా పచ్చని ఆకులో రక రకాల పదార్థాలను పెట్టుకుని అందరూ కలిసి ఆనందంగా తినడం ఈ ఓనం పండుగ ప్రత్యేకత. ఈ సామూహిక విందులో తప్పకుండా పాల్గొనాలనే ఆచారం కూడా ఉంది.

ఓనం పండుగ అంటే ఏమిటి?

ఓనం పండుగ కేరళ రాష్ట్ర ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ముఖ్యమైన వ్యవసాయ పండుగ. ఇది కేరళ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది.

ఓనం పండుగ ఎన్ని రోజుల పాటు జరుగుతుంది?

ఓనం పండుగ సాధారణంగా 10 రోజుల పాటు కొనసాగుతుంది. త్రిక్కరటప్పన్ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-allu-arjun-allu-arjuns-onam-festival-wishes-to-malayalis/national/541612/

Breaking News Indian Festivals Kerala culture Kerala harvest festival Kerala Onam festival Kerala traditions latest news Onam 2025 Onam celebrations Onam festival Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.