పెంపుడు జంతువులను (Pet dog) ప్రేమించే వారికి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (Surat Municipal Corporation) షాక్ ఇచ్చింది. ఇకపై ఇంట్లో కుక్కను పెంచుకోవాలంటే పొరుగు వారి అనుమతి తప్పనిసరి. అందుకోసం ఏకంగా పది ఇరుగుపొరుగు వారు NOC ఇవ్వాల్సిందే.ఇది కేవలం ఇండిపెండెంట్ ఇళ్లకే పరిమితం కాదు. అపార్ట్‌మెంట్లలో నివసించేవారు అయితే సంక్షేమ సంఘం ఛైర్‌పర్సన్, కార్యదర్శుల అనుమతి కూడా తప్పనిసరి. ఈ ఇద్దరి నుంచి ఎన్‌ఓసీలు తీసుకురాకపోతే పెంపుడు కుక్కను ఉంచడం కుదరదు.ఈ కఠిన నిర్ణయానికి కారణం ఒక విషాద ఘటన. మే నెలలో నగరంలో ఓ చిన్నారి కుక్క దాడిలో మృతి చెందాడు. ఆ ఘటన అందరిని కలచివేసింది. అటువంటి విషాదాలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
పెంపుడు జంతు యజమానుల్లో అసంతృప్తి
ఈ నిర్ణయం స్థానికంగా పెద్ద చర్చగా మారింది. పెంపుడు జంతు యజమానులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. “ఇల్లు నాదే, కానీ జంతువును ఉంచుకోవాలంటే పొరుగు వారి అనుమతి ఎందుకు?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
పెంపుడు కుక్కలకు పాస్ కావాలా? – నెటిజన్ కామెంట్స్
ఈ నిబంధనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ప్రజల భద్రత కోసం ఇది సరైన అడుగు అంటుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై హక్కుల ఉల్లంఘనగా అభిప్రాయపడుతున్నారు. “ఇకపై కుక్కలకు పాస్‌పోర్ట్ కూడా కావాలా?” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.సూరత్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇతర నగరాలు కూడా ఇదే బాటలో నడుస్తాయా? అనే ప్రశ్న ముందుకొస్తోంది.
Read Also : Pakistan : పాకిస్థాన్‌లో జనంపైకి దూకిన పెంపుడు సింహం