📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Budget 2026: పాత పన్ను vs కొత్త పన్ను విధానంలో ఏది బెస్ట్?

Author Icon By Vanipushpa
Updated: January 29, 2026 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర బడ్జెట్‌ 2020లో కొత్త పన్ను విధానం (New Tax Regime) ప్రవేశపెట్టినప్పటి నుంచి.. పన్ను చెల్లింపుదారులకు కొన్ని ప్రశ్నలు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) కొనసాగించాలా లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? అనే దానిపై ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. నిర్ణయం తీసుకోవడంలొ ప్రధానంగా ఆదాయం, దానిపై లభించే తగ్గింపులు, మినహాయింపుల పరిమితులు వంటివి ప్రభావం చూపుతున్నాయి. 2023 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ (Default) విధానంగా ప్రకటించింది. దీని అర్థం ఏంటంటే కొత్త విధానాన్ని ఎంచుకోని పన్ను చెల్లింపుదారులు ఆ విధానం ప్రకారం వారి పన్ను లెక్కింపును ఎదుర్కొంటారు. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం వర్తించనుంది.

Read Also: Baramati News: ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు

Budget 2026: పాత పన్ను vs కొత్త పన్ను విధానంలో ఏది బెస్ట్?

సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షలు

కొత్త పన్ను విధానం కింద.. బడ్జెట్ 2025లో పన్ను స్లాబ్లు సవరణలతో తీసుకొచ్చారు. ప్రాథమిక మినహాయింపు రూ.4 లక్షలకు పెంచారు. కాబట్టి తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఎక్కువ ఆదా చేయవచ్చు. అదే పాత విధానంలో 60 ఏళ్లలోపు వ్యక్తుల ప్రాథమిక మినహాయింపు రూ. 2.5 లక్షలు, సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షలు, సూపర్ సీనియర్ (80+) సిటిజన్లకు రూ. 5 లక్షలు ఉండేది. ఇక పాత విధానంలో కుటుంబ పెన్షన్ మినహాయింపు రూ. 50 వేలు గా ఉండగా, కొత్త విధానంలో ఇది రూ. 25 వేలకి పెంచారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త పన్ను విధానం కింద ప్రయోజనాన్ని పొందవచ్చు. అధిక ఆదాయం (రూ. 25 లక్షల వరకు) ఉన్నవారికి కూడా కొత్త విధానం ద్వారా రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఆదా సాధ్యమే. అదనంగా తక్కువ సర్‌ఛార్జ్ రేట్ల కారణంగా రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయమున్నవారికి కూడా కొత్త విధానం లాభదాయకంగా ఉంటుంది.

రెండింటి మధ్య తేడా ఏమిటంటే..

పాత పన్ను విధానం వివిధ తగ్గింపులు, మినహాయింపులను (Sections 80C – ELSS, PPF, జీవిత బీమా, 80D – వైద్య బీమా, HRA, గృహ రుణ వడ్డీ మొదలైనవి) క్లెయిమ్ చేయగలుగుతుంది. దీని వల్ల ఎక్కువ ఆదాయ bracketలో ఉన్న వ్యక్తులకు గణనీయమైన పన్ను ఆదా ఉంటుంది. కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ పెద్దగా తగ్గింపులు లేవు. కేవలం ప్రామాణిక మినహాయింపు, NPSలో యజమాని సహకారం (Section 80CCD(2)), కొన్ని పదవీ విరమణ సంబంధిత మినహాయింపులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే.. పాత పన్ను విధానం ఎక్కువ తగ్గింపులు.. మినహాయింపులను ఉపయోగించగలిగే వ్యక్తులకు బలంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

financial planning income tax India Income Tax Slabs Indian tax system New Tax Regime Old Tax Regime tax benefits India tax comparison Tax Saving Tips Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.