📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Karnataka: అధికారులు విదేశీ పర్యటనలు ఆపండి:సీఎం సిద్ధరామయ్య

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కఠిన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లిన తరువాత, ప్రభుత్వ అధికారులు విధిగా సమర్పించాల్సిన నివేదికలను సమయానికి ఇవ్వడంలో విఫలమైతే, వారి భవిష్యత్తు పర్యటనలపై నిషేధం విధిస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు.

ఈ చర్య, ప్రభుత్వంలో పనితీరును మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే ఒక ముఖ్యమైన ప్రయత్నంగా భావించబడుతుంది. అయితే ఈ నిర్ణయం డిసెంబర్ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ఆమోదంతో సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం సెప్టెంబర్ 23న ఓ సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం 2024 ఆగస్టు నెల నుంచి 2025 జూలై మధ్య కాలంలో స్టడీ టూర్లు, ఇతర అధికారిక పనుల కోసం విదేశాలకు వెళ్లి.. నివేదికలు సమర్పించని వారంతా వెంటనే సమర్పించాలని స్పష్టం చేసింది.

పర్యటనలకు సంబంధించిన నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది.

సాధారణంగా విదేశీ పర్యటనలకు (foreign trips) వెళ్లి వచ్చిన వారం రోజుల తర్వాతే ప్రభుత్వాధికారులకు తమ పర్యటనలకు సంబంధించిన నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ నివేదికలో వారు నేర్చుకున్న విషయాలు, వాటిని రాష్ట్రంలో అమలు చేయడానికి సంబంధించిన సిఫార్సులను తప్పనిసరిగా చేర్చాలి.

అయితే చాలామంది అధికారులు ఈ నిబంధనను పాటించడంలో విఫలం అయ్యారు. ఈ నిర్లక్ష్యంపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది.ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాన్ని ఉల్లంఘించిన అధికారులను హెచ్చరిస్తూ.. సర్క్యులర్‌లో స్పష్టమైన నిబంధనను చేర్చారు.

Karnataka

విదేశీ పర్యటనలకు సంబంధించిన నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని

“భవిష్యత్తులో ఏదైనా అధికారిక విదేశీ పర్యటనకు అనుమతి కోసం ప్రతిపాదన సమర్పించే ముందు అధికారులు తమ మునుపటి విదేశీ పర్యటనలకు సంబంధించిన నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని చెప్పారు. ఆ నివేదికలను సమర్పించిన తర్వాత మాత్రమే ప్రస్తుత పర్యటన కోసం సమర్పించిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటామని సర్క్యులర్‌ (Circular) లో పేర్కొన్నారు.

ఈ నిబంధన ద్వారా అధికారులు ఇకపై విదేశీ పర్యటనలను తేలికగా తీసుకోకుండా, వాటిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రభుత్వ అండర్ సెక్రటరీ టి. మహంతేష్ (T. Mahantesh) సంతకం చేసిన ఈ సర్క్యులర్‌లో.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విదేశీ పర్యటనలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

సాధారణంగా అధికారుల విదేశీ పర్యటనలు కేవలం వినోదం కోసం కాకుండా.. ప్రభుత్వ పాలనలో మెరుగుదల కోసం ఉండాలనే లక్ష్యంతోనే సర్కారు ఈ నిర్ణయం తెలుసుకుంది. ఇది రాష్ట్ర పరిపాలనలో జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుందని.. తద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

failure to submit reportsBreaking News foreign tours government officials Karnataka Chief Minister Siddaramaiah latest news report submission Strict action Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.