రానురాను వివాహబంధాలు దారుణంగా మారుతున్నాయి. భర్త ఉండగానే మరో,పరాయిపురుషుడితో భార్య, భార్య ఉండగానే మరో,పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధాలు (Extramarital affairs) పెరిగిపోతున్నాయి. ఇంకా కొందరైతే ఏకంగా ప్రియుడితో కలిసి భర్తలను లేపేస్తున్నారు.
ఈమధ్య ఈ భార్యల దారుణాలు ఎక్కువైపోతున్నాయి. అలాగని భర్తలు ఏమీ తీసిపోవడం లేదు. వారి భార్యలకు చుక్కలుచూపిస్తున్నారు. తాజాగా ఒడిశాలోని పూరీజిల్లా (Puri District) లో ఓ భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. అదేటో మీరే చదవండి..
అర్ధనగ్నంగా ఊరేగించిన భర్త..
ఒడిశా (Odisha) లోని పూరీ జిల్లాలో గిరిధారి ఖాతువా అనే వ్యక్తి తన భార్యతో గొడవల కారణంగా ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. భార్యకు,వివాహేతర సంబంధం ఉందని ఖాతువా అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు. కాలేజీ లెక్చరర్ అయిన ఖాతువా భార్య ఓ కాలేజీలోలెక్చరర్గా పనిచేస్తుంది. అయితే ఐదుళ్లుగా భార్యకు దూరంగా ఉన్న గిరిధారి ఖాతువా ఆమెపై నిఘా పెట్టాడు.
బుధవారం రాత్రి,భార్య స్టూడెంట్ లీడర్ తో బెడ్రూంలో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దొరికిన భార్యను, ఆమె ప్రియుడిని చేతులు కట్టేసి అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ (Odisha Police station) వరకు వారిని ఊరేగించాడు.
భార్య,ప్రియుడిని అరెస్టు చేయించేందుకు తీసుకొస్తే
ఇద్దరినీ వీధిలో ఊరేగిస్తూ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తూ అందరికి విషయం,చెప్తు వచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ గా మారింది. పోలీసులు భర్త ఖాతువాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన భార్య,ప్రియుడిని అరెస్టు చేయించేందుకు తీసుకొస్తే, పోలీసులు మాత్రం భర్తపైనే కేసు పెట్టి జైలుకు పంపించారు.
ఎందుకని అంటారా? న్యూసెన్స్ చేసినందుకు ఆయనను జైలుకు పంపారు. గొడవలుంటే వాటిని రహస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలాబహిర్గతం చేసి, అల్లరిపాలు చేయాలని చూసిన భర్తకే పోలీసులు షాక్ ఇచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: