📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Odisha: టీచర్ లైంగిక వేధింపులు.. కాలేజీ లోనే నిప్పంటించుకున్న యువతీ

Author Icon By Sharanya
Updated: July 13, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బాలసోర్‌లో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన విద్యా వ్యవస్థపై, సమాజపు విలువలపై తీవ్ర ప్రశ్నలు కలుగజేస్తోంది. ఫకీర్ మోహన్ కాలేజీ (Fakir Mohan College) లో చదువుతున్న ఓ యువతిపై ఆ కళాశాలలో పని చేస్తున్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (HOD) సమీర్ కుమార్ సాహు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

వేధింపులు.. హెచ్చరికలు.. విఫలమైన ఫిర్యాదులు:

బాధితురాలు ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు చదువుతున్నది. హెచ్‌వోడి సమీర్ కుమార్ సాహు (HOD Sameer Kumar Sahu) యువతిని లైంగికంగా వేధించాడు. కోరిక తీర్చకుంటే భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. టీచర్‌ వేధింపులను ఆ విద్యార్థిని భరించలేకపోయింది. జూలై 1న కంప్లైంట్‌ సెల్‌కు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ, ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాలేజీ ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లింది. మిగతా స్టూడెంట్స్‌తో కలిసి ప్రిన్సిపాల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది.

నిప్పంటించుకున్న విద్యార్థిని:


ప్రిన్సిపాల్‌ నుండి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని జూలై 13న ప్రిన్సిపాల్‌ చాంబర్‌ ఎదుటే తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుంది. హఠాత్పరిణామానికి తోటి విద్యార్థులు షాక్‌ అయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఒక స్టూడెంట్‌కు కూడా మంటలంటుకున్నాయి. ఇద్దరిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు వారిని తరలించారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు:

ఈ సంఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడమే కాక, కాలేజీ పాలక వర్గంపై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు గట్టిగా కోరుతున్నారు.

మంత్రుల స్పందన:

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్యబన్షి సూరజ్ ప్రకటించారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు సమీర్ కుమార్ సాహును అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Assam: భార్యతో విడాకులు తర్వాత పాలతో స్నానం చేసిన భర్త..

Balasore College Incident Breaking News Justice for Students latest news Odisha news Odisha Student Harassment Sexual Harassment in Colleges Teacher Misconduct Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.