📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Odisha hospital fire : ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

Author Icon By Sai Kiran
Updated: March 16, 2026 • 10:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Odisha hospital fire : ఒడిశాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో రోగులను కాపాడే ప్రయత్నంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర కలకలం నెలకొంది.

తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రమాదం

తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో, రోగులు గాఢనిద్రలో ఉన్న వేళ ఈ ప్రమాదం జరిగింది. తీవ్రమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఉన్న ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిస్థితి భీభత్సంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే ఐసీయూలో ఉన్న రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు.

Read also: Janasena 13th Formation Day: జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

రోగులను తరలిస్తుండగా మృతి

సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపిన వివరాల (Odisha hospital fire) ప్రకారం మొత్తం 23 మంది రోగులను ఇతర వార్డులకు తరలించారు. అయితే వీరిలో ఏడుగురు రోగులు వార్డులు మారుస్తున్న సమయంలోనే పరిస్థితి విషమించి మృతి చెందారు.

మరో ముగ్గురు రోగులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలకు తెగించి రోగులను కాపాడిన ఆసుపత్రి సిబ్బంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

ఘటన జరిగిన వెంటనే సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

అలాగే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu hospital fire odisha icu fire accident india odisha hospital fire odisha hospital tragedy scb medical college fire Telugu News trauma care icu fire

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.