📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Odisha: భార్యకు వైద్యం చేయించడానికి 600 KM రిక్షా తొక్కిన భర్త

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పేదరికం ఒకవైపు, తోడుగా నిలిచే వారు లేని పరిస్థితి మరోవైపు. అనారోగ్యంతో ఉన్న భార్యకు ఏం అవుతుందో అన్న భయం ఒకవైపు, ఆమెను కాపాడుకోవాలన్న తపన మరోవైపు. అంబులెన్స్‌కు డబ్బులు లేని దుర్భర పరిస్థితి ఇంకొవైపు. ఓ 70 ఏళ్ల వృద్ధుడు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా హృదయాలను కలచివేస్తోంది. భార్యను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు, ఏకంగా 600 కిలోమీటర్లు రిక్షా తొక్కుతూ ప్రయాణించాడు. ఈ సంఘటన ఒడిస్సా (Odisha) లో చోటుచేసుకుంది.

Read Also: NEET PG 2026: నీట్‌ పీజీ పరీక్ష తేదీ రిలీజ్

నాకు జీవితంలో కేవలం రెండు ప్రేమలు మాత్రమే ఉన్నాయి

సంబల్‌పూర్‌లోని మోడిపాడ ప్రాంతానికి చెందిన బాబు లోహర్ రిక్షా తొక్కుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2025 నవంబర్‌లో అతడి భార్య జ్యోతి పెరాలటిక్ స్ట్రోక్ (మెదడుకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి.. మెదడు కణాలు చనిపోవడానికి దారితీసే పరిస్థితి) వచ్చింది. దీంతో స్థానిక వైద్యులు.. కటక్‌లో ఉన్న ఎస్‌సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సిఫార్సు చేశారు. అయితే అంబులెన్స్‌లో లేదా ఇతర వాహనంలో తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బాబు లోహర్ వద్ద డబ్బులు లేవు.

Odisha: Husband rides 600 KM rickshaw to get his wife treated

దీంతో తన రిక్షాలోనే భార్యను ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించుకున్నాడు.బాబు లోహర్ రిక్షాపై కొన్ని పాత మెత్తలు వేసి.. తన భార్యను వాటిపై కూర్చోబెట్టాడు. అనతంరం దేవుడి నామాన్ని జపిస్తూ రిక్షా తొక్కినట్లు తెలిపాడు. “నాకు జీవితంలో కేవలం రెండు ప్రేమలు మాత్రమే ఉన్నాయి. ఒకటి నేను ఇంటికి తిరిగి తీసుకెళ్తున్న నా భార్య. మరొకటి నా రిక్షా. ఈ రెండింటిలో ఏది లేకున్నా నేను ఉండలేను” అని చెప్పాడు బాబు లోహర్.

ఈ క్రమంలో సహాయం చేస్తామన్న పోలీసుల విజ్ఞప్తిని కూడా సున్నితంగా తిరస్కరించాడు బాబు లోబర్. తాము వాహనం ఏర్పాటు చేస్తామని చెప్పినా.. అతను నిరాకరించాడని టంగి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ బికాష్ సేథీ తెలిపారు. తాము బలవంతం చేస్తే.. సంబల్‌పూర్‌కు వెళ్లే దారిలో ఆహారం తినడానికి కొన్ని డబ్బులు తీసుకున్నాడని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Human interest story latest news Odisha news Old Man Love Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.