కులాలు, మతాలు మనుష్యుల్లో విభేదాలు సృష్టించడం మాత్రమే కాక అవి సమాజానికి ఎంతో హాని కలిగిస్తాయి. అంతేకాదు అనేకసార్లు మానవత్వాన్నే మంటకలిసేలా చేస్తాయి. (Odisha Govt Ban Harijan Word) కులాల అంతరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో అయితే పెద్దకులస్తుల న్యాయమే చెల్లుతుంది. దళితులకు మాట్లాడే అధికారం కాని ప్రశ్నించే అధికారం ఉండదు. షెడ్యూల్డ్
కులాలవారు అంబెద్కర్ ని ఓ దేవుడిగా భావిస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇకపై హరిజన అనే పదాన్ని వాడకూడదని ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది. ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి..
‘షెడ్యూల్డ్ కులాలు’ అనే పదాన్ని వాడాలి
ప్రభుత్వ వ్యవహారాల్లో ‘హరిజన'(Odisha Govt Ban Harijan Word) పదాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఒడిశా (odisha) ప్రభుత్వం. దీనికి బదులుగా షెడ్యూల్డ్ కులాలు’ అనే పదాన్ని వాడాలని స్పష్టం చేసింది. ఆగస్టు 12 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల మేరకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అన్ని ప్రభుత్వ శాఖలు ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించింది.
కించపరిచేదిగా మారిపోయిన పదం
మహాత్మాగాంధీ (Mahatma Gandhi) స్వయంగా హరిజన (Odisha Govt Ban Harijan Word) అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ కాలక్రమేణా ఈ పదం గౌరవప్రదమైనదిగా కాకుండా, కొందమందికి కించపరిచేదిగా మారిపోయింది. దీంతో
పలు సంఘాలు ఈ పదాన్ని అధికారికంగా తొలగించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ఒడిశా మానవహక్కుల కమిషన్ జారీ చేసిన
మార్గదర్శకాల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం
హరిజన పదానికి బదులుగా, షెడ్యూల్డ్ కులం, అనునుచి జాతి పదాలను వాడాలని సూచించింది. అయితే సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ
ఇలాంటి ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 1982లోనే దళితులను ఉద్దేశించి ‘హరిజన’ అనే పదాన్ని వాడకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చింది.