📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Odisha Crime: అమెరికా దత్తత కథలో భారత అమ్మాయి భావోద్వేగ షాక్

Author Icon By Pooja
Updated: November 26, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తల్లిదండ్రులకు దూరమై అనాథ ఆశ్రమంలో పెరిగిన ఒడిశా యువతి పూజ (అలియాస్ సెజెల్)ని 2018లో అమెరికాకు చెందిన దంపతులు దత్తత తీసుకుని అమెరికా తీసుకెళ్లారు. గత ఏడేళ్లుగా వారి వద్దే పెరుగుతున్న పూజ, ఉన్నట్టుండి తన దత్తత తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని, బలవంతంగా మత మార్పిడి చేయాలని ఒత్తిడి చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. తనను కాపాడాలని కోరుతూ ఒడిశా(Odisha Crime) ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, విదేశాంగ శాఖ సహకారంతో ఆమెను అమెరికా నుంచి ఇండియాకు రప్పించాయి.

Read Also: Delhi Blast: ఫరీదాబాద్‌లో వైట్‌ కాలర్ టెరర్ మాడ్యూల్, రహస్య మదరసా లింక్

ఇండియాకు వచ్చాక యువతి దిమ్మతిరిగే ట్విస్ట్, అసలు కారణం వెల్లడి

అధికారుల చొరవతో ఒడిశాలోని(Odisha Crime) బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (భువనేశ్వర్)లో దిగిన వెంటనే, పూజ మీడియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తాను గతంలో వీడియోలో చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలేనని ఆమె ప్రకటించింది. తన దత్తత తల్లి తనను ఏనాడూ వేధించలేదని, మతం మార్చుకోమని బలవంతం చేయలేదని, ఆమె చాలా మంచి వ్యక్తి అని వెల్లడించింది.

ఆమె ఆరోపణలు చేయడానికి అసలు కారణాన్ని పూజ బయటపెట్టింది: ఆమె బాలాసోర్‌కు చెందిన ఒక యువకుడిని ప్రేమిస్తోంది. ఆ యువకుడిని కలుసుకోవడం కోసం, ఒడిశాకు తిరిగి రావడం కోసమే, తన దత్తత తల్లి మీద ఇలాంటి అసత్య ఆరోపణలు చేశానని అంగీకరించింది. తాను చిన్నప్పుడు చదువుకున్న నీలగిరి స్కూల్లోనే ఆ యువకుడితో పరిచయం ఏర్పడిందని, రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా మళ్లీ కలుసుకున్నామని తెలిపింది. యువకుడిని కలవాలనే తన కోరికను దత్తత తల్లి అంగీకరించకపోవడం వల్ల, ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నానని వివరించింది. తన ఆరోపణల వల్ల తన దత్తత తల్లి చాలా ఇబ్బందుల్లో పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

False Accusations Google News in Telugu Latest News in Telugu Social Media Video Drama US Adoptive Parents

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.