చిప్స్ ప్యాకెట్ లో (chips packet) ఉన్న బొమ్మను మింగేసిన బాలుడు.. పరుగులు తీసిన పేరెంట్స్ పిల్లలు తినేందుకు తల్లిదండ్రులు ఎన్నో ఆహార పదార్థాలు ఇస్తుంటారు. చాలా జాగ్రత్తగా వారిని చూసుకోవాలి. లేకపోతే ఆ ఆహారమే వారి ప్రాణాలు పోయేందుకు కారణం అవుతాయి. తాజాగా ఓ బాలుడు చిప్స్ ప్యాకెట్ లో ఉన్న బొమ్మ తిని మరణించిన విషాదసంఘటన ఇది. చిప్స్ ప్యాకెట్ ఓ చిన్నారి ప్రాణం తీసింది. పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్లలో వచ్చిన ఓ చిన్న బొమ్మను నాలుగేళ్ల బాలుడు గుటుక్కున మింగేశాడు. అది గొంతులో అడ్డుపడటంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పరుగుపరుగున ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మార్గంలోనే ప్రాణాలు వదిలాడు.
Read Also: Health: పిల్లల రక్తపోటు పెరుగుదల సంకేతాలు
ఒడిశాలో జరిగిన విషాద ఘటన
ఒడిశాలో (Odisha) కంధమాల్ జిల్లా (Kandhamal District) ముసుమహాపాడ గ్రామానికి చెందిన రంజిత్ ప్రధాన్ కి నాలుగేళ్ల కుమారుడు బిగిల్ ఉన్నాడు. ఇటీవల పనిమీద బయటకు వెళ్లిన రంజిత్ ఇంటికి వెళ్తూ పిల్లాడి కోసం ఓ షాప్ లో చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ప్యాకెట్ తెరవగానే అందులో చిన్న తుపాకీ బొమ్మ కనిపించింది. సంబరంగా చిప్స్ ప్యాకెట్ తీసుకుని ఇంటివద్దే ఆడుకుంటూ చిప్స్ చిన్నాడు. అందులో ఉన్న గన్ బొమ్మ కూడా చిప్స్ అనుకున్నాడేమోగానీ దాన్ని కూడా నోట్లో వేసుకుని మింగేశాడు.
దీంతో అది గొంతుకు అడ్డుపడిపోయింది. ఊపిరి ఆడక బాలుడు సతమతమవుతుండగా గొంతులో నుంచి బొమ్మ తుపాకీని (gun) తొలగించేందుకు ప్రయత్నించారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్ష చేసి, బాలుడు అప్పగికే వరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతులో ఇరుక్కున్న బొమ్మ వల్ల బాలుడి వాయుమార్గం మూసుకుపోయిందని, అందుకే బాలుడు మరణించాడని ఆరోగ్యకేంద్రం ఇన్ ఛార్జి వైద్య అధికారి జకేష్ సమంతరాయ్ తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: