ఒడిశా(Odisha)లోని ప్రఖ్యాత పూరి జగన్నాథ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ బెదిరింపు(Social Media Threat) సందేశం కలకలం రేపింది. అలాగే బీజేడీ ఎంపీ సుభాషిస్ కుంతియాపై దాడి చేస్తామని, ఓ షాపింగ్ కాంప్లెక్స్‌ను ధ్వంసం చేస్తామని పేర్కొంటూ చేసిన ఆన్‌లైన్ పోస్టు వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించడంతో పాటు సీసీటీవీ నిఘాను పెంచారు.
Read also: Magha masam: ఆధ్యాత్మికంగా విశిష్టమైన శుభ కాలం
ఫేక్ సోషల్ మీడియా ఖాతాతో ఆలయంపై బెదిరింపు
ఈ పోస్టు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, ఒక మహిళ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ యూజర్ ఐడీని సృష్టించి ఈ బెదిరింపులు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: