📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Nuclear power: అణు విద్యుత్ 100 గిగా వాట్లకు పెంపు

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 10:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థర్మల్ ప్లాంట్లు అణు యూనిట్లుగా మార్పు దేశ వ్యాప్తంగా 10 ప్లాంట్లు ఎంపిక

హైదరాబాద్: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను అధిగమించడంతో పాటు, మిగులును సాధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల నుండి 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలనే కేంద్రం యొక్క ప్రతిష్టాత్మక లక్ష ్యంలో భాగంగా కాలపరిమితికి దగ్గరగా ఉన్న పాత థర్మల్ విద్యుత్ ప్లాంట్ల (Thermal power plants)ను అణు విద్యుత్ (Nuclear power) యూనిట్లుగా మార్పు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

242.04 గిగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లు

2032 నాటికి మొదట 22 గిగావాట్ల అణు విద్యుత్ (Nuclear power) సామర్త్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 484.82 గిగావాట్లుగా ఉంది. వీటిలో 184.62 గిగావాట్ల పునరుత్పాదక శక్తి (Gigawatts of renewable energy), 49.38 గిగావాట్ల పెద్ద జల విద్యుత్, 8.78 గిగావాట్ల సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ ఉత్పత్త ప్రాజెక్టులు ఉండగా, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి శిలాజ అధారిత ఉష్ణ విద్యుత్కు సంబంధించి 242.04 గిగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లు ఉన్నాయి. ఈ నేపధ్యంలో 2047 నాటికి దేశంలో 10 పాత థర్మల్ ప్లాంట్లను అణు విద్యుత్ యూనిట్లుగా మార్చనుంది. విద్యుత్ యూనిట్లలో తిరిగి ఉపయోగించేందుకు వివిధ ప్రాంతాల్లోని 10 పాత లేదా రిటైర్డ్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను గుర్తించింది. వీటిని తనిఖీ చేసి ప్రాథమికంగా విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై భారత అణు విద్యుత్ సంస్థ సభ్యులతో కూడిన సైట్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గుర్తించిన ఆయా ప్రదేశాలను తనిఖీల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రక్రియలో మొదటి అడుగు. అణు విద్యుత్ ప్లాంట్ల ఎంపిక థర్మల్ యూనిట్ల ఏర్పాటు కంటే చాలా కఠినమైనదని, కాబట్టి ప్రక్రియకు సమయం పడుతుందని పేర్కొన్నాయి. ప్రధానంగా స్థల ఎంపిక ప్రక్రియ ప్లాంట్ల భూకంప తీవ్రత, నీటి లభ్యత మరియు సమీపంలోని నివాస స్థలంపై ఆధారపడి ఉంటుంది. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు అణు విద్యుత్ ప్లాంట్ చుట్టూ కనీసం 1 కిలోమీటర్ల పరిధికి లోడిన మండలాలను గుర్తించడం, ప్రజా నివాసాలకు నిషేధాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్చబడిన థర్మల్ యూనిట్లలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు ఏర్పాటు చేయడంతో సహా, పరిమాణం మరియు వనరుల లభ్యత ఆధారంగా, అణు విద్యుత్ ఉత్పత్తి యొక్క వివిధ పద్దతులను అంచనా వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి గుజరాత్లోని వానక్బోరి థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ఒక బృందం సందర్శించింది. ఈ సైట్లో ఒక్కొక్కటి 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు యూనిట్లు ఉన్నాయి. మిగిలిన పాత థర్మల్ యూనిట్ల ప్రాంతాలను అణు విద్యుత్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

read hindi news: hindi.vaartha.com

Read also: Online Betting: ఆన్ లైన్ గేమ్ కు యువకుడు బలి..మనోవేదనతో తాత మృతి

100 GW nuclear target Breaking News carbon-free energy sources gigawatt nuclear capacity latest news nuclear energy growth nuclear power in India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.