📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

NPPA: మధుమేహం, బీపీ మందుల ధరలపై కేంద్రం ఊరట

Author Icon By Ramya
Updated: August 3, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో 35 నిత్యావసర మందుల ధరల తగ్గింపు

NPPA: సామాన్యులు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉపశమనం కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రకటించింది.

ఈ నిర్ణయంతో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, నొప్పి నివారణ, యాంటీబయాటిక్ వంటి కీలక మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయి.

NPPA

ఏయే మందుల ధరలు తగ్గాయి?

ధరలు తగ్గిన జాబితాలో ప్రముఖ ఫార్మా కంపెనీలు తయారుచేసే అనేక ముఖ్యమైన మందులు ఉన్నాయి. వాటిలో కొన్ని:

డాక్టర్ రెడ్డీస్ (Dr. Reddy’s): ఏసెక్లోఫెనాక్, పారాసెటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ కాంబినేషన్ టాబ్లెట్ ధరను రూ. 13గా ఎన్‌పీపీఏ నిర్ణయించింది.

క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ (Cadila Pharmaceuticals): ఇదే ఫార్ములేషన్‌తో విక్రయించే టాబ్లెట్ ధర రూ. 15.01గా నిర్ణయించారు.

గుండె సంబంధిత మందులు: గుండె జబ్బులకు వాడే అటోర్‌వాస్టాటిన్ (40 ఎంజీ), క్లోపిడోగ్రెల్ (75 ఎంజీ) కలిగిన టాబ్లెట్ ధర రూ. 25.61గా ఖరారు చేశారు.

ఇతర మందులు: విటమిన్ డి లోపానికి వాడే కోలికాల్సిఫెరాల్ చుక్కల మందు, చిన్న పిల్లలకు ఇచ్చే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్, నొప్పి నివారణకు ఉపయోగించే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ (ఒక మిల్లీలీటర్‌కు రూ. 31.77) కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

కొత్త ధరలకు నిబంధనలు

ఎన్‌పీపీఏ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రిటైల్ వ్యాపారులు, డీలర్లు కొత్త ధరల జాబితాను తమ దుకాణాల్లో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. ఈ ధరల కంటే ఎక్కువకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు (Strict measures) తీసుకుంటారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టడంతో పాటు, డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఆర్డర్-2013, నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద చర్యలు తీసుకుంటారు. ఈ ధరలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనంగా ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఫార్మా కంపెనీలకు ఆదేశాలు

ఔషధ తయారీ కంపెనీలు తమ కొత్త ధరల పట్టికను ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐపీడీఎంఎస్) (IPDMS) ద్వారా జారీ చేయాలని ఎన్‌పీపీఏ ఆదేశించింది.

ఈ సమాచారాన్ని ఎన్‌పీపీఏకి, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లకు సమర్పించాలి. ఈ తాజా ఉత్తర్వులతో పాత ధరల ఉత్తర్వులు రద్దయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

NPPA ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది?

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఫార్మాస్యూటికల్స్ విభాగం కింద ఉంది, ఇది రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలో భాగం. ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రకారం, NPPA ఫార్మాస్యూటికల్స్ విభాగానికి అనుబంధ కార్యాలయంగా స్థాపించబడింది.

NPPA చరిత్ర ఏమిటి?

మూలం: ఔషధాల (ధరల నియంత్రణ) ఆర్డర్ (DPCO) నిబంధనలను అమలు చేస్తూ, ఔషధాలు మరియు వైద్య పరికరాల ధరలను నియంత్రించడానికి NPPA ఆగస్టు 29, 1997న స్థాపించబడింది.

Read hindi news: hindi.vaartha.com

read also:

https://vaartha.com/punjab-businessman-sets-house-on-fire-for-refusing-to-marry/national/525162/

affordable healthcare Breaking News drug price reduction essential medicines India latest news NPPA decision pharma policy India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.