2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, గణాంకాల గారడీలతో సరిపెట్టుకుంటుండా, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించాలని ఆయన పేర్కొన్నారు. కేవలం జీడీపీ అంకెలు గొప్పగా చూపిస్తే సరిపోదన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పన, సామాన్యుడి పొదుపు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం గణాంకాలతో ఆర్థిక వ్యవస్థ అంతా బాగుందనే భ్రమను కల్పిస్తోందని, ఈ బడ్జెట్‌తోనైనా ఆ అలాంటి ఆలోచనల నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు.
Read Also: imachal Pradesh: భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
మరో ఇరవై రోజుల్లో బడ్జెట్
2026-27 బడ్జెట్‌ను మరో ఇరవై రోజుల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందని, ఇదే సమయంలో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఈ బడ్జెట్ కచ్చితంగా ప్రతిబింబిస్తుందని రమేష్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల( 2026-27 నుంచి 2031-32) కాలానికి సంబంధించిన ఈ సిఫార్సులు కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాల పంపిణీ, రాష్ట్రాల మధ్య ఆ నిధుల కేటాయింపుకు నిర్దేశిస్తాయన్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ బలవంతంగా తీసుకొచ్చిన 60:40 వ్యయ విధానంతో రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయన్నారు.
దేశంలో సంపద, ఆదాయం, వినియోగంలో అసమానతలు
భారత ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా మూడు సమస్యలు పట్టి పీడిస్తున్నాయని జైరాం రమేశ్ విశ్లేషించారు. “కార్పొరేట్ కంపెనీలకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. అవి భారీగా లాభాలు గడిస్తున్నాయి. అయినా సరే, అవి తిరిగి కొత్త పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడం లేదు. పెట్టుబడులు రాకపోతే కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయి? దేశంలో గృహ పొదుపు రేట్లు గణనీయంగా పడిపోయాయి. మధ్యతరగతి ప్రజల చేతిలో డబ్బు నిలవడం లేదు. ఇది దేశ పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. దేశంలో సంపద, ఆదాయం, వినియోగంలో అసమానతలు అంతకంతకూ లోతుగా మారుతున్నాయి. ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఈ అగాధాన్ని పూడ్చకపోతే ప్రమాదం తప్పదు” అని అన్నారు. కేవలం జీడీపీ వృద్ధి రేటును చూసి మురిసిపోవద్దని కాంగ్రెస్ నేత హితవు పలికారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: