త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి. ఈ పరిణామాల మధ్య చెన్నైలో ఇండియా టుడే నిర్వహించిన తమిళనాడు రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Stalin) పాల్గొన్నారు. పలు అంశాలపై మాట్లాడారు. డీఎంకే సవాళ్లు, రాహుల్ గాంధీతో సత్సంబంధాలు, కాంగ్రెస్‌తో పొత్తు/ సీట్ల పంపకాల గురించి ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిపై ఘాటు విమర్శలు గుప్పించారు. డీఎంకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
Read Also: Rahul Gandhi: అమెరికాకు లొంగిపోయిన మోడీ
రాహుల్ గాంధీతో తనకు సోదర అనుబంధం ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. తన సొంత తమ్ముడిగా భావిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కు కేటాయించాల్సిన మంత్రి పదవులపై స్పష్టత ఇవ్వలేదు గానీ.. 2021 కంటే కూడా మరింత పురోగతి సాధిస్తామని తేల్చి చెప్పారు. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి బలంగా ఉందని, తాము కలిసే ఈ ఎన్నికలలో పోటీ చేస్తామనీ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అధికార పంపకం ప్రశ్న ప్రస్తుతానికి తలెత్తదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ ఎన్డీఏను తీవ్రంగా విమర్శించారు. బీజేపీది “డబుల్ ఇంజిన్” కాదని, “డబ్బా ఇంజిన్” అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు “ఆర్యులు-ద్రవిడుల మధ్య యుద్ధం”గా అభివర్ణించారు. తప్పుడు సమాచారం, ద్వేషం, మత ఉద్రిక్తతలను బీజేపీ వ్యాపింపజేస్తోందని ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: