BJP national president : భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా Nitin Nabin ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు JP Nadda పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
ప్రస్తుతం నితిన్ నబీన్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆయనను ఈ పదవికి బీజేపీ అధిష్ఠానం నియమించింది. అప్పటి నుంచే నబీన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Also: Singareni Collieries: మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
46 ఏళ్ల నితిన్ నబీన్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఆరెస్సెస్ (BJP national president) నేపథ్యంతో పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయన, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో ఆయన పాత్ర కీలకమని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: