భారతదేశంలో రహదారుల అభివృద్ధి దిశగా కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న కృషి గమనార్హం. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో నూతన ఆశలు రేకెత్తించాయి. మన దేశ రోడ్లను అమెరికా రహదారులకన్నా బాగా నిర్మిస్తాం అనే గడ్కరీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మాటలు కేవలం రాజకీయ హామీగా కాకుండా, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని బట్టి చూస్తే ఇది నిజమేనని భావిస్తున్నారు.
కెన్నెడీ వ్యాఖ్యలతో ప్రారంభం
నితిన్ గడ్కరీ ఒక ప్రసంగంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ చేసిన ఓ వ్యాఖ్యను గుర్తు చేశారు. అమెరికా ధనిక దేశం కాబట్టి రహదారులు బాగుంటాయని కాదు, రహదారులు బాగుంటేనే దేశం ధనికమవుతుంది అన్నాడు కెన్నెడీ. ఈ మాటలే తనకు ప్రేరణగా మారాయని గడ్కరీ తెలిపారు. రహదారులు దేశాభివృద్ధికి శిరోమణిగా నిలుస్తాయని ఆయన స్పష్టంగా చెప్పారు. నాకు అప్పగించిన బాధ్యతను హుందాగా నిర్వహిస్తున్నాను. నా మాటలు హామీలు కాదు, హస్తరేఖలాంటివి. నేను చేసి చూపిస్తా అని నితిన్ గడ్కరీ అన్నారు. ప్రజలకు ఇచ్చే హామీలను కార్యరూపం దాల్చించే నేతగా గడ్కరీ పేరుగాంచారు. దేశ అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రోడ్లు బాగున్న దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మన రోడ్లకు సంబంధించి తాను కేవలం హామీలు మాత్రమే ఇవ్వడం లేదని చేసి చూపిస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని గత 11 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో రహదారులు, ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు.
Read also: Stock Market: 90 రోజుల బ్రేక్ తర్వాత ఊపందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్