కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) నివాసానికి బాంబు పెట్టినట్టు ఆదివారం వచ్చిన ఓ బెదిరింపు కాల్ (Threatening call), మహారాష్ట్ర నాగ్‌పూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, మంత్రిగారి ఇంట్లో బాంబు పెట్టినట్టు చెప్పడంతో, పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అలెర్ట్ అయింది.
అప్రమత్తమైన పోలీసులు – బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
గడ్కరీ నివాసానికి వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకుని ఇంటి పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఇంటి లోపల, బయటి ప్రాంగణంలో అత్యంత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి మూలను జల్లెడ పట్టినా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది నకిలీ బెదిరింపు కాల్ అని పోలీసులు ధృవీకరించారు.
నిందితుడి పట్టివేత – మద్యం దుకాణంలో పని చేస్తున్న వ్యక్తి కాల్ వెనుక
ఈ కాల్‌ను పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. కొద్ది సమయంలోనే నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ బృందం, నిందితుడి ఆచూకీ గుర్తించింది. నిందితుడిని ఉమేష్ విష్ణు (accused is Umesh Vishnu) రౌత్గా గుర్తించారు. అతను తులసి బాగ్ రోడ్డులోని ఒక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉమేష్ ఎందుకు గడ్కరీ (Nitin Gadkari) ఇంటికి ఇలా బెదిరింపు కాల్ చేశాడన్న అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: