📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Latest News: Suman Berry: తెలంగాణపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రశంసలు

Author Icon By Anusha
Updated: December 10, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి దిశగా కీలకమైన ‘Telangana Rising Vision Document’ను విడుదల చేశారు. ఈ సమ్మిట్‌లో దేశ–విదేశాల నుంచి ప్రముఖులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, పరిశ్రమల దిగ్గజం ఆనంద్ మహీంద్రా, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో, పాల్గొన్నారు. మంగళవారం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-2047 ఆవిష్కరణలో భాగంగా, సుమన్ బేరీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Puducherry: కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు ఆటగాళ్లు

డెవలప్‌మెంట్ మోడల్ ఇకపై పని చేయకపోవచ్చు

తలసరి ఆదాయంలో తెలంగాణ ఉన్నత స్థితికి చేరుకుందని.. ఎగువ మధ్యస్థ ఆదాయం (అప్పర్ మిడిల్ ఇన్‌కమ్) దేశాల సరసన చేరిందని.. ఇండియా ఈ స్థాయికి రావాలంటే మరో ఏడు సంవత్సరాలు పడుతుందంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ (Suman Berry) చెప్పుకొచ్చారు. తలసరి ఆదాయంలో.. రానున్న 5-7 సంవత్సరాల మధ్య దేశం ఏ అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ స్థాయికి చేరుకోవాలని కలలు కంటుందో.. తెలంగాణ ఇప్పటికే ఆ స్థాయికి చేరుకుందని తెలిపారు.

అయితే ఈ స్థితికి చేరుకున్న తర్వాతే అసలైన పరీక్ష ఎదురవుతుందని.. ఇలాంటి సమయంలో మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తపడాలని ఆయన (Suman Berry) సూచించారు. ఇన్నాళ్లు రాష్ట్రం అనుసరించిన డెవలప్‌మెంట్ మోడల్ ఇకపై పని చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు.”మీరు (తెలంగాణ రాష్ట్రం) ఇప్పుడున్న స్థాయిలో కేవలం పెట్టుబడులు మాత్రమే వస్తే సరిపోదు.

NITI Aayog’s Suman Berry praises Telangana

తెలంగాణ తనకంటూ ఒక విజన్‌ను ఏర్పాటు చేసుకోవడం ప్రశంసనీయం

ఈ దశలో ఆవిష్కరణలు, సృజనాత్మకత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటివి అత్యంత కీలకంగా నిలుస్తాయి” అన్నారు. ఈ దశలో భవనాలు, నిర్మాణాల కన్నా ఉత్పాదకత పెంచడంపై దృష్టి సారించాలన్నారు. రానున్న భవిష్యత్తు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నిబంధనల సరళీకరణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

ప్రపంచ ప్రమాణాలతో తెలంగాణ తనకంటూ ఒక విజన్‌ను ఏర్పాటు చేసుకోవడం ప్రశంసనీయం అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో.. నీతి ఆయోగ్.. ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు.2006 ప్రాంతంలో హైటెక్ సిటీ అంటే కేవలం ఒక బోర్డు మాత్రమే అన్నారు సుమన్ బేరీ. కానీ నేడు అది అత్యద్భుతంగా నిలిచిందన్నారు. 2006లో ఆయన ఏడీబీ (ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) సమావేశం కోసం హైదరాబాద్ వచ్చానని గుర్తుకు చేసుకున్నారు.

ఆ సమయంలో హైటెక్ సిటీ అంటే కేవలం ఒక బోర్డు తప్ప అక్కడ ఏమీ కనిపించేదన్నారు. కానీ ఇప్పుడు చూస్తే.. మాటల్లో వర్ణించడానికి వీలు లేనంత అద్భుత ప్రపంచం అక్కడ వెలసిందని ప్రశంసించారు. “తెలంగాణ ప్రజలు కలలు కనడంలో, వాటిని సాకారం చేసుకోవడంలో వారికి వారే సాటి అనడానికి ఇదే నిదర్శనం” అని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Hyderabad growth latest news Suman Berry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.