Gold Prices India: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి గల కారణాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడి నిల్వలను కొనుగోలు చేస్తుండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ఆర్‌బీఐ (RBI) సెంట్రల్ బోర్డ్ సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: MobileBan: 16 ఏళ్ళ పిల్లలకు ఫోన్ బాన్.. ఏ రాష్ట్రం లో అంటే?
దిగుమతులు ఆందోళనకరంగా లేవు.. ఆర్‌బీఐ నిఘా!
దేశీయంగా బంగారం, వెండి దిగుమతులపై వస్తున్న వార్తలపై మంత్రి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం భారత్‌లో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని ఆమె భరోసా ఇచ్చారు. ఈ దిగుమతి పరిణామాలను, మార్కెట్ ఒడిదుడుకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని, తగిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.అమెరికా సుంకాల్లో మార్పుల ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై అంచనా వేయడం చాలా తొందరపాటు అవుతుంది’ అని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: