📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nirmala Sitharaman: నా చీర పై కాదు బడ్జెట్ పై ద్రుష్టి ఉంచండి

Author Icon By Tejaswini Y
Updated: February 2, 2026 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించే కేంద్ర బడ్జెట్ ప్రసంగం కంటే, తాను ధరించిన వస్త్రధారణపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆమె ఈ విషయంపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026లో క్యాన్సర్ రోగులకు భారీ ఊరట

Nirmala Sitharaman

పురుష మంత్రులకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయా?

వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి, నెట్టింట జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. “ప్రతి ఏటా బడ్జెట్ సమయంలో నేను ఎలాంటి చీర ధరించాను అనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అదే ఒక పురుష మంత్రి బడ్జెట్(Union Budget 2026) ప్రవేశపెడితే.. ఆయన వేసుకున్న సూట్ గురించో, బట్టల గురించో చర్చ జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు వారిని అడుగుతారా?” అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు.

విధానాలపై చర్చించండి.. వ్యక్తిగత విషయాలపై కాదు

దేశాభివృద్ధికి సంబంధించిన ఆర్థిక విధానాలు, పన్ను సంస్కరణలు, కేటాయింపులపై లోతైన చర్చ జరగాల్సిన సమయంలో.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా మంత్రి ధరించే దుస్తులపై దృష్టి సారించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

నేపథ్యం

ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ తమిళనాడు వారసత్వాన్ని ప్రతిబింబించేలా మెజెంటా రంగు కాంజీవరం పట్టు చీరను ధరించారు. అయితే, ఆమె ప్రసంగం ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో ఆమె చీర రంగు, దాని వెనుక ఉన్న ‘రాజకీయ అర్థాల’పై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BudgetDiscussion Google News in Telugu NirmalaSitharaman NirmalaSitharamanSaree UnionBudget2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.