📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Nirmala Sitharaman – ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ : కేంద్ర ఆర్థిక మంత్రి

Author Icon By Sudha
Updated: September 17, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా మొత్తం 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీ (GST) పై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం సిటీలోగల మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) మాట్లాడారు.అనేక రంగాల్లో ఇప్పటికే జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని, పన్ను శ్లాబ్‌లను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని చెప్పారు. 12 శాతం పన్ను పరిధిలో ఉండే వస్తువుల్లో దాదాపు 99 శాతం వస్తువులను 5 శాతం పన్ను శ్లాబ్‌ పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉండే సిమెంట్‌ సహా 90 శాతం వస్తువులను 18 శాతం పన్ను శ్లాబ్‌ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. 2017కు ముందు మొత్తం 17 రకాల పన్నులు ఉండేవని, వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని ఆర్థిక మంత్రి (Nirmala Sitharaman) గుర్తుచేశారు.

Nirmala Sitharaman – ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ : కేంద్ర ఆర్థిక మంత్రి

ఉదాహరణకు 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదని, అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను, నాలుగు శ్లాబ్‌ల రూపంలో జీఎస్టీని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది రూ.22.08 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామని తెలిపారు. పాలు, పెరుగు సహా పలు నిత్యావసరాలను 5 శాతం పన్ను శ్లాబ్‌ నుంచి సున్నా శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కారు, ఫ్రిజ్‌, ఏసీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు జీఎస్టీ నూతన సంస్కరణలు పెద్ద ఊతమని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును సున్నా చేశామని చెప్పారు. యూపీఏ హయాంలో 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తెచ్చామని తెలిపారు. సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకురాలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

నిర్మలా సీతారామన్ బ్యాక్ గ్రౌండ్?

సీతారామన్ 1980లో తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, 1984లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ మరియు ఎం. ఫిల్ పట్టా పొందారు. ఆ తర్వాత ఆమె పిహెచ్‌డిలో చేరారు.

భారతదేశపు మొదటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు?

నిర్మలా సీతారామన్ (జననం ఆగస్టు 18, 1959, మధురై, తమిళనాడు, భారతదేశం) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు మరియు ఆర్థికవేత్త, ఆమె మే 2019లో కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా మొదటిసారిగా నియమితులయ్యారు, ఈ రెండు పదవులను పూర్తి సమయం నిర్వహించిన దేశంలోని మొదటి మహిళగా నిలిచారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/microsoft-gives-massive-shock-to-users/business/549146/

Breaking News Finance Minister GST Indian Economy latest news Nirmala Sitharaman tax reform Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.