📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Nifa virus: నిఫా వైరస్‌ కలకలం..మూడు జిల్లాల్లో హైఅలర్ట్‌

Author Icon By Sharanya
Updated: July 6, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళలో నిఫా వైరస్ (Nifa virus) మళ్లీ విస్తరిస్తూ ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ ఇప్పటివరకు ఇద్దరిని ప్రభావితం చేసింది. ఓ యువతి చనిపోగా .. మరొకరు చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై మూడు ముఖ్య జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తోంది.

నిఫా వ్యాప్తి వివరాలు:

ఈ ఘటన మలప్పురం జిల్లాలో మొదలైంది. 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని (Inter student) నిఫా (Nifa virus) బారిన పడి జులై 1న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను కొట్టక్కల్‌లోని ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో, పాలక్కాడ్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ కూడా ఇదే వైరస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. వీరిద్దరి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, నిఫా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

హైఅలర్ట్, క్వారంటైన్ చర్యలు:

ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ నేతృత్వంలో కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా, మరణించిన యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు.

నిఫా వైరస్ – ప్రమాద కారకత్వం:

నిఫా వైరస్ జంతువుల నుండి, ముఖ్యంగా గబ్బిలాలు మరియు పందుల (Bats and pigs) నుంచి మానవులకు వ్యాపిస్తుంది. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి కూడా వ్యాపించగలదు. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు మెదడువాపు లేదా తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తోంది. వైరస్‌ వ్యాప్తిపై నిఘాను మరింత పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి ఏటా కేరళలో నిఫా వైరస్‌ కేసులు బయటపడుతున్నాయి.

ప్రభుత్వ చర్యలు:

రాష్ట్రం లోని అన్ని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కంటేన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సమాచారం మరియు జాగ్రత్తలు తీసుకునే విధంగా మౌలిక సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Rahul Gandhi: బీహార్‌ లో వ్యాపారి హత్య..ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ తీవ్ర విమర్శలు

#HealthCrisis #HighAlert #KeralaAlert #KeralaNews #NipahInKerala #NipahOutbreak #NipahPrecautions #NipahVirus #PublicHealth #StaySafe #VeenaGeorge #ViralFever #VirusAlert Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.