దేశంలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘోర బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా లోపాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న స్లీపర్ కోచ్ బస్సులను తక్షణమే రోడ్లపై నుంచి తొలగించాలని NHRC అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Chandrababu: ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
NHRC ఆందోళనకు కారణమైన ప్రధాన లోపాలు
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కర్నూలు, సౌదీ బస్సు ప్రమాదాల వంటి ఘటనల కారణంగా ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. NHRC దృష్టికి వచ్చిన ప్రధాన లోపాలు:
- అత్యవసర ద్వారాల నిరోధం: అత్యవసర ద్వారం ఉన్న చోట కూడా సీట్లు ఏర్పాటు చేయడం లేదా అదనపు సీట్ల నిర్మాణంతో ప్రమాద సమయాల్లో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో ప్రయాణికులు వెంటనే బయటకు రాలేకపోతున్నారు.
- అగ్నిమాపక వ్యవస్థ లేమి: చాలా బస్సుల్లో అగ్ని ప్రమాదాలను నియంత్రించే రక్షణ వ్యవస్థలు (ఫైర్ ఎక్స్టింగ్విషర్లు) ఉండటం లేదు.
- అంతర్గత నిర్మాణం: స్లీపర్ ఏసీ బస్సుల లోపలి భాగం ఇరుగ్గా ఉండటం వల్ల ప్రమాద సమయాల్లో వెంటనే బయటకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటోంది.
- సరుకు నిల్వ స్థలం: స్లీపర్ బస్సుల అడుగు భాగంలో సరకు నిల్వకు ఏర్పాట్లు ఉంటాయి. వీటిలో అగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు నేరుగా ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
NHRC ఆదేశాలు, చర్యలు
ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న బస్సుల్లో 50 శాతానికి పైగా స్లీపర్ ఏసీ బస్సులే ఉన్నాయి. ట్రావెల్స్ సంస్థలు ఇష్టానుసారం బస్సులను మార్పులు చేర్పులు చేసి నడపడం, కండీషన్‌పై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి, ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ట్రావెల్స్ సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని NHRC స్పష్టం చేసింది. ఈ తరహా బస్సులపై నిఘా పెంచాలని కూడా మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: