📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Tariffs- ట్రంప్ టారిఫ్ దెబ్బ.. భారత్ కు ముప్పులేదంటున్న నిపుణులు

Author Icon By Sharanya
Updated: August 28, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచదేశాలపై అధిక సుంకాల యుద్ధానికి దిగుతున్నారు. ప్రపంచ దేశాలపై రోజుకో విధంగా టారిఫ్లతో బెదిరిస్తున్నారు. తాజాగా భారత్ ను టారిఫ్ లతో తొక్కేయాలని ప్రయత్నిస్తోందని ప్రపంచమంతా వాపోతుంది. అయితే ఈ ఆర్థిక యుద్ధంలో అసలు బలమైన కార్డులు మాత్రం భారత్ చేతిలోనే ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. ఇందుకు కారణం భారతదేశం ప్రస్తుత
పరిస్థితుల్లో కేవలం అమెరికా (America) పైనే ఆధారపడటం లేదు. గ్లోబల్ సౌత్ మార్కెట్లలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు పాధాన్యం ఇస్తోంది. ఒక తలుపు మూసుకున్నా, మరో ఆరు తలుపులు తెరిచేస్థితిలో భారత్ ఉంది.

News Telugu

తాత్కాలిక ఒత్తిడి తప్ప దీర్ఘకాలిక వ్యూహం కాదు

ప్రస్తుతం అమెరికా విధిస్తున్న టారిఫ్ లు తాత్కాలిక ఒత్తిడి తప్ప దీర్ఘకాలిక వ్యూహం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారత్కు అమెరికా ఎంత ముఖ్యమో అమెరికాకు కూడా భారత్ అంటే ముఖ్యమని అంటున్నారు. భారత మార్కెట్ని కోల్పోవడం అమెరికాకి ఏమాత్రం సరికాదు. అందుకే ప్రస్తుత టారిఫ్లను ఒకరకమైన రాజకీయ, ఆర్థికంగా ఆట పట్టిస్తున్నట్లుగా భావించవచ్చు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి గ్లోబల్ సౌత్ మార్కెట్లలో విస్తరించాలి. అమెరికా మార్కెట్లో కేవలం 34 కోట్లు మంది వినియోగదారులు ఉన్నా, గ్లోబల్ సౌత్ మార్కెట్లో మాత్రం 600 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్యల తేడా ఒక్కటే భారత్ వ్యూహాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

భారత్ కు బలమైన రక్షణకవచం

అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సమయంలో, విదేశీ డిమాండ్ భారత్ కు బలమైన రక్షణ కవచంగా నిలుస్తోంది. రాబోయే జీఎస్టీ సంస్కరణలు (GST reforms), మార్కెట్లోకి వస్తున్న అదనపు ద్రవ్యం, దేశీయ వినయోగాన్ని పెంచేలా చేస్తాయి. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా, దేశీయ డిమాండ్ వల్ల ఆ లోటును కొంతవరకు పూడ్చుకోవచ్చు. చక్రవర్తి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. బీజేసీ నాయకుడు సావియో రోడ్రిగ్స్ అభిప్రాయం ప్రకారం, అమెరికా విధిస్తున్న 50శాతం టారిఫ్లు టెక్స్టైల్, లెదర్ వంటి కార్మికాధారిత రంగాలను దెబ్బతీయొచ్చు. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత్ ఈ సవాళ్లను ఎదుర్కొనే శక్తి కలిగి ఉందని భారత ఆర్థిక నిపుణులు అంటున్నారు. కేవలం రష్యా నుంచి అధికమొత్తంలో చమురు దిగుమతి చేసుకోవడం గిట్టని ట్రంప్ ఏకంగా 25 నుంచి 50శాతం సుంకాలకు పెంచారు. పెంచిన టారిఫ్ లు 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-us-firing-children-attack-kill-trump-graffiti/international/536898/

Breaking News India economy India trade International Trade latest news tariff impact Telugu News trade experts Trump tariffs US India relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.