📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Pakistan- భారత్ హెచ్చరికతో లక్షా 50వేల మంది పాక్ ప్రజలు సురక్షితం

Author Icon By Sharanya
Updated: August 28, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: భారత్ పాకిస్థాన్ల మధ్య పహల్గాం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సింధునదీ జలాల విషయంపై రెండు దేశాలు పరస్పర ఆరోపణలు, హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే వీటన్నింటిని భారతదేశం పక్కన పెట్టి పాకిస్తాన్ ను మానవతాదృక్పథంలో భారీ వరదలు (Heavy Floods) వస్తాయని హెచ్చరించింది. ఏక్షణంలోనైనా పాకిస్థాన్ లో సట్లేజ్, చినాబ్, రావి తదితర నదులపై ఉన్న జలాశయాలు గేట్లు ఎత్తబోతున్నామని రెండు రోజుల క్రితమే భారత్ పాకిస్తాన్కు సూచించింది. భారత్ హెచ్చరికంతో పాకిస్తాన్ అలెర్ట్ అయింది. ఆ దేశంలోని ప్రావిన్స్ లోని 1.50 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండియా సాయం వల్లే తాము బతికామంటూ మోదీని మెచ్చుకుంటూ పాకిస్తానీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీకి థాంక్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

News Telugu

భారీ వర్షాలతో అతలాకుతలమైన పాకిస్తాన్

గల నెలరోజులుగా పాకిస్తాన్లో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆకస్మిక వరదల వల్ల వేలల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ఖైబర్ పఖుంక్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa Province), పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఆగస్టునెలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్లో కురిసిన భారీ వర్షాలకు 800 మందిపైగా ప్రజలు మరణించారు. బునేర్ జిల్లాలోనే ఆకస్మిక వరదల కారణంగా 300 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 2022లో పాకిస్తాన్ మూడింట ఒక వంతు దేశం నీట మునిగింది. కాగా మరోసారి పాకిస్తాన్కు వరద ముప్పు ఉందని భారతదేశం పాకిస్తాన్ను హెచ్చరించింది. సట్లేజ్, చినాబ్, రావి వంటి నదులపై ఉన్న జలాశయాల గేట్లు ఎత్తబోతున్నామని రెండురోజుల క్రితమే భారత్ పాకిస్తాన్ను అలెర్ట్ చేసింది. అసలే తరచూ వర్షాలతో పాకిస్తాన్ ప్రజానీకం చిన్నాభిన్నం అవుతున్నది. దీంతో భారత్ హెచ్చరికతో పాక్ తనదేశ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/mk-stalin-criticism-on-mk-stalin-for-participating-in-rahul-gandhis-yatra/national/537077/

1.5 lakh people safe Breaking News Disaster Management India Pakistan Relations India warning latest news pakistan floods Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.