తెలంగాణ (TG) ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నేతృత్వంలోని వంతారా బృందం కీలక ఎంవోయూ కదుర్చుకుంది.
Read Also: Sarpanch Elections: తొలి విడత ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే..
అంతర్జాతీయ స్థాయి పార్క్ ఏర్పాటుకు
తెలంగాణ (TG) లో నాల్గవ నగరంగా రూపుదిద్దుకోబోతున్న ఫ్యూచర్ సిటీలోనే ఈ అంతర్జాతీయ స్థాయి జూ పార్కు ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వంతారాతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా.. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ స్థాయి పార్క్ ఏర్పాటుకు సంబంధించి నూతన జూ డిజైన్, సాంకేతిక నైపుణ్యాలు, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలకు సంబంధించి.. రాష్ట్రానికి మార్గదర్శకత్వం అందనుంది.
గుజరాత్‌లోని వంతారాలో ఉండే సదుపాయాలన్నీ ఫ్యూచర్ సిటీలో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఈ కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుండగా.. ఈ నెలాఖరున గుజరాత్‌లో ఉన్న వంతారాని సందర్శిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: