Corona : కరోనాకు కొత్త వ్యాక్సిన్లు అవసరమా?

Read Time:  1 min
Coronavirus India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
Coronavirus India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
FONT SIZE
GET APP

దేశంలో మళ్లీ కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్న దృష్ట్యా ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఏప్రిల్ నుండి నమోదవుతున్న కొత్త కేసుల్లో చాలా భాగం ఒమిక్రాన్ వేరియంట్‌(Omicron Variant)కు చెందిన నాలుగు కొత్త సబ్ వేరియంట్స్ (LF.7, XFG, JN.1.16, NB.1.8.1) కారణమని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో వైరస్ ప్రభావం, వ్యాప్తి తీరు, తీవ్రతలపై పరిశోధనలు ముమ్మరం అయ్యాయి.

NIVలో జన్యు విశ్లేషణ కొనసాగుతోంది


కొత్త వేరియంట్లపై పూర్తి సమాచారం పొందేందుకు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) జన్యు విశ్లేషణ ప్రారంభించింది. ఈ ప్రక్రియ ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఈ కొత్త వేరియంట్లపై ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయన్నదానిపై స్పష్టత రానుంది. ఆయా వేరియంట్ల జన్యు నిర్మాణాన్ని గుర్తించి వాటికి వ్యతిరేకంగా టీకాలు ఎలా స్పందిస్తున్నాయన్నది పరిశీలిస్తున్నారు.

కొత్త టీకాలపై కేంద్ర నిర్ణయం కీలకం


ప్రస్తుతం ఉన్న టీకాల ప్రభావం తక్కువగా ఉంటే, కొత్త టీకాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా అనే అంశంపై చివరి నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. NIV డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపిన ప్రకారం, తాజా విశ్లేషణ ఫలితాల ఆధారంగా కొత్త వ్యాక్సిన్ల అవసరంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కానీ భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : School Fee : ‘వామ్మో.. నర్సరీకి రూ.50వేల ఫీజు’.. ఓ తండ్రి ఆవేదన

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.