📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

UPI: రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

Author Icon By Vanipushpa
Updated: December 31, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జనవరి 2026 నుండి UPI (UPI) లావాదేవీల పరిమితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి, అలాగే భద్రతను పెంచడానికి కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేశాయి. జనవరి 2026 నుండి ప్రధాన మార్పులు.. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. సాధారణ వ్యక్తిగత లావాదేవీల (P2P) పరిమితిలో పెద్ద మార్పులు లేకపోయినా కొన్ని ప్రత్యేక కేటగిరీలలో లిమిట్స్ పెరగనున్నాయి.

Read Also: America: మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

UPI

పెరగనున్న లావాదేవీల పరిమితి

సాధారణంగా ఒక రోజుకు UPI పరిమితి రూ. 1 లక్ష వరకు ఉంటుంది. అయితే 2026 నుండి ఈ లిమిట్ ను రూ. 2 లక్షల వరకూ పెంచే అవకాశం ఉంది. అలాగే కొన్నింటికి మినహాయింపులు లేదా పెంపు ఉండవచ్చు. ఆసుపత్రి బిల్లులు , విద్యా సంస్థల ఫీజుల కోసం పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ & ఇన్సూరెన్స్: ఐపీఓ (IPO) సబ్‌స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం కూడా లిమిట్ పెంచాలని పరిశీలిస్తున్నారు. 2. సెకండరీ వెరిఫికేషన్, భద్రత.. ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి, మొదటిసారి కొత్త వ్యక్తికి రూ. 2,000 కంటే ఎక్కువ పంపేటప్పుడు 4 గంటల టైమ్ విండో లేదా అదనపు వెరిఫికేషన్ ఉండవచ్చు. దీనివల్ల పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది.పెద్ద మొత్తంలో చేసే పేమెంట్స్ కు అదనపు వెరిఫికేషన్ అవసరం అవ్వొచ్చు. అంటే ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారానే ఎక్కువమొత్తంలో చెల్లింపు చేయగలుగుతారు.

రోజువారీ గరిష్ట పరిమితి రూ. 6 లక్షలు

చిన్న చిన్న లావాదేవీల కోసం వాడే UPI Lite పరిమితిని కూడా పెంచే యోచనలో ఉన్నారు. పిన్ ఎంటర్ చేయకుండానే చేసే చెల్లింపుల పరిమితిని రూ. 500 నుండి రూ. 1,000 కి పెంచవచ్చు. ఇకపోతే సెప్టెంబర్ 15, 2025 నుండి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. వేర్వేరు కేటగిరీలకు వేర్వేరు పరిమితులు ఉన్నాయి. పెట్టుబడులు & ఇన్సూరెన్స్: స్టాక్ మార్కెట్ (Capital Markets), ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ రీపేమెంట్స్ (EMI, B2B Collections) కోసం ఒక్కో లావాదేవీకి పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ విభాగాల్లో రోజువారీ గరిష్ట పరిమితి రూ. 10 లక్షలుగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు: క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెరిగింది. వీటి రోజువారీ గరిష్ట పరిమితి రూ. 6 లక్షలు. నగల కొనుగోళ్లు (Jewellery): బంగారం లేదా నగలు కొనుగోలు చేసేటప్పుడు ఒక్కో లావాదేవీకి గతంలో ఉన్న రూ. 1 లక్ష పరిమితిని రూ. 2 లక్షలకు పెంచారు. దీ

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Banking digital payments Financial Transactions india New Rules online banking payment systems Technology Telugu News Paper Telugu News Today UPI UPI update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.