కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు (New Guidelines) తీసుకొచ్చింది. అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్‌ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్‌లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య
తప్పనిసరి
కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కారాల వేడుకల్లో కూడా వందేమాతరం ప్లే చేస్తారు. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆయన రాక సమయంలో, అలాగే తిరిగి వెళ్లే సమయంలో ఈ గేయం వినిపిస్తుంది. అయితే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా సినిమా థియేటర్లలో మాత్రం వందేమాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అక్కడ ప్లే చేసినా నిలబడటం తప్పనిసరి కాదని కేంద్రం వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: