భారతదేశ విమానయాన రంగంలో ప్రస్తుతం ఒకే సంస్థ ఆధిపత్యం కొనసాగుతోందనే విమర్శలు తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్లైట్స్ విభాగంలో ఇండిగో (IndiGo) సంస్థ దాదాపు మోనోపోలీ స్థాయిలో మార్కెట్‌ను నియంత్రిస్తోంది. దేశీయ విమాన ప్రయాణాల్లో సుమారు 65 శాతానికి పైగా మార్కెట్ వాటా ఈ ఒక్క సంస్థదే కావడం గమనార్హం. అయితే ఇటీవల ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాలు, ప్రయాణికులు పడ్డ ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: Gold rate 26/12/25 : బంగారం ఆగట్లేదు! 26న మళ్లీ పెరిగిన ధరలు
ఒకే సంస్థపై ఆధారపడటం వల్ల కలిగే నష్టాలను గుర్తించి కొత్త ఎయిర్‌లైన్స్ ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజాగా మూడు కొత్త విమాన సంస్థలకు (New Airlines) కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ క్రింది మూడు సంస్థలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లభించింది..
- Shankh Air (శంఖ్ ఎయిర్): ఈ సంస్థ ఇప్పటికే అనుమతులు పొందింది. 2026 నాటికి తన విమానాలను గాల్లోకి ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- 2. Al Hind Air (అల్ హింద్ ఎయిర్): కేరళకు చెందిన ప్రముఖ ట్రావెల్ గ్రూప్ ‘అల్ హింద్’ ఈ ఎయిర్‌లైన్‌ను ప్రారంభిస్తోంది.
- 3. Fly Express (ఫ్లై ఎక్స్‌ప్రెస్): ఇది కూడా దేశీయ మార్కెట్లో తన సేవలను అందించడానికి సిద్ధమవుతోంది.
ఎక్కువ ఆప్షన్లు
ప్రస్తుతం ఇండియాలో ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. కానీ, నడుస్తున్న ఎయిర్‌లైన్స్ మాత్రం చాలా తక్కువ. జెట్ ఎయిర్‌వేస్, గో ఫస్ట్ వంటి సంస్థలు మూతపడటంతో ఫ్లైట్ మార్కెట్ అంతా ఇండిగో, ఎయిర్ ఇండియా (New Airlines) చేతుల్లోకి వెళ్లిపోయింది. కొత్త ఎయిర్ లైన్స్ రాకతో వాటి ఏకఛత్రాధిపత్యానికి చెక్ పడుతుంది. ప్రస్తుతం 90 శాతం మార్కెట్ కేవలం రెండు పెద్ద గ్రూపుల దగ్గరే ఉంది. దీనివల్ల పోటీ తగ్గి, టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కనెక్టివిటీ పెరిగే అవకాశం కూడా ఉంది.
‘ఉడాన్’ (UDAN) పథకం ద్వారా చిన్న నగరాలను కూడా విమాన మార్గాలతో కలపాలని ప్రభుత్వం చూస్తోంది. కొత్త సంస్థలు వస్తే ఈ లక్ష్యం సులభం అవుతుంది.ఏదేమైనా విమానయాన రంగం చాలా రిస్క్‌తో కూడుకున్నది. గతంలో చాలా కంపెనీలు నష్టాలతో మూతపడ్డాయి. మరి ఇప్పుడు వస్తున్న (Shankh Air, Al Hind Air, Fly Express) సంస్థలు ఇండిగో వంటి దిగ్గజాలను ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. అయితే ఎక్కువ ఆప్షన్లు అందుబాటులోకి రావడం అనేది సామాన్య ప్రయాణికులకు శుభపరిణామమే!
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: