📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

NDRF: విపత్తులవేళ మృతదేహాలను గుర్తించేందుకు ఎన్డీఆర్ఎఫ్ లోకి ప్రత్యేక జాగిలాలు

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: విపత్తుల నిర్వహణలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) అందించే సేవల గురించి తెలిసిందే. వరదలు, భూకంపాలు, కొండ చెరియలు విరిగిపడినపుడు, ఘోర రైలు, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించే ఎన్ఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటి వరకు బాధితులను రక్షించడానికి ప్రాధాన్యత ఇస్తుండగా ఇకముందు ఈ తరహా ఘటనల్లో మరణించిన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు చొరవ తీసుకోనుంది.

ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన జాగిలాల బృందం

ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన జాగిలాల బృందం (Dog Squad) త్వరలో రంగంలో దిగనుంది. ఈ జాగిలాల మొదటి బ్యాచ్ ఇప్పటికే తీసుకుంటుండగా త్వరలో ఇది పూర్తికానుంది. జాగిలాలు విపత్తుల వేళ శిధిలాలలో మృతదేహాలను గుర్తించేందుకు వీలుగా శవాల వాసను పోలివుండే ఒక రకమైన సెంట్ వాసనను విదేశాల నుంచి తెప్పించి వీటి చేత జాగిలాలకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగం గా మొదటి విడతగా బెల్జియం, మాలినోయిస్, లాబ్రాడార్ జాతులకు చెందిన జాగిలాలకు విపత్తుల సమయాల్లో మృత దేహాలను గుర్తించే శిక్షణ ఇస్తున్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లోని ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బెటాలియన్లలో అరడజనకు పైగా జాగిలాలకు శిక్షణ పూర్తి కావస్తుండగా త్వరలోనే తొలిబ్యాచ్ జాగిలాలు విధుల్లో చేరనున్నాయి. విపత్తుల సమయంలో ప్రాణాలను కాపాడడంపై ఎన్డీఆర్ఎఫ్ ఇంతకాలం ఎక్కువగా దృష్టి సారిస్తున్నా తమ వారి కోసం, ఒక వేళ చనిపోయి వుంటే మృత దేహాల కోసం బాధిత కుటుంబాలు పడుతున్న వేదనను గమనించి ఈ ఏర్పాట్లు ఎన్ఎఆ చెబుతున్నారు. చేసినట్లు అధికారులు ఇంత కాలం వివత్తుల వేళ మృతదేహాల గుర్తింపు కష్టంగా (Identification of bodies difficult) వుండేదని, చాలా ఘటనలో మరణించిన వారి శవాలు దొరికేవి కావని, కొన్ని సార్లు కష్టంగా రోజుల తరువాత అవయవాలు లభించేవని ఎన్ఐఆర్ఫ్ అధికారులు తెలిపారు. విపత్తుల వేళ ప్రాణాలతో బయటపడ్డ వారి కంటే చనిపోయిన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారుతుండడం తెలిసిందే.

మృతదేహాలు గుర్తించడం సులభం

కొన్ని ఘటనల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చాలా దూరంలో మృతదేహాలు లభిస్తుండగా ఇంకొన్ని చోట్ల మట్టిలో కూరుకుపోయిన స్థితిలో వుంటున్నాయి. ఈ తరహా ఘటనల్లో మృతదేహాలను గుర్తించాలంటే ఇప్పు డున్న జాగిలాలకు సాధ్యం కావడం లేదు. విదేశాల్లో మృతదేహాలను, మానవ అవ యవాలను గుర్తించేందుకు వీలుగా జాగిలాలకు ప్రత్యేకంగా శిక్ష ణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు. ఈ తరహా ఏర్పాట్లు దేశంలోనూ చేసేందుకు నిర్ణయించిన ఎన్డీఆర్ఎఫ్ ఇందుకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన జాగిలాలకు శిక్షణ ఇస్తోంది. వచ్చే నెలలో వీటి శిక్షణ వూర్తవుతుందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. అనంతరం వీటిని దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన బెటాలియన్లలో అందుబాటులో వుంచుతామని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఈ జాగిలాలు ఏ మేరకు విజయ వంతమవుతాయనేది పరిశీలించి అనంతరం మరిన్ని జాగిలాలకు శిక్షణ ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఇటీవల శ్రీశైలం ఎస్ఎల్ బిసి సొరం గంలో కార్మికులు చిక్కుకుపోయిన సమయంలో వారి ఆచూకి కొనుగొనేందుకు రాష్ట్ర పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎంత కష్టపడ్డారో తెలిసిందే. ఈ సమయంలోనే కేరళ పోలీసు విభాగానికి చెందిన రెండు జాగిలాలు రంగంలో దిగి మృతదేహాల గుర్తింపులో పోలీసులకు సహాయం అందించాయి. కేరళలోని వయనాడ్లో యేడాది క్రితం కొండ చరి యలు విరిగిపడినపుడు మట్టిలో కూరుకు పోయిన మృతదేహాల గుర్తింపుకు, ఇతర సహా యక చర్యల్లో ఈ జాగిలా లనే ఉపయోగించారు. ఇప్పు డు ఎన్డీఆర్ఎఫ్ ఇదే తరహాలో శిక్షణ పొందిన జాగి లాలను రంగంలో దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Koneru Hampi: FIDE మహిళల ప్రపంచ కప్ లో చరిత్ర సృష్టించిన కోనేరు హంపి

Breaking News dead body detection dogs Earthquake Rescue latest news NDRF Disaster Response NDRF Rescue Dogs Specially Trained Dogs Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.