వారం రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ఎన్నికల మేనిఫెస్టోను (NDA Manifesto) విడుదల చేసింది. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. శుక్రవారం ఉదయం పాట్నాలో జరిగిన సమావేశంలో ‘సంకల్ప పత్ర’ పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ మేనిఫెస్టోను(NDA Manifesto) విడుదల చేశారు. వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ఉద్యోగాల హామీతో పాటు కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడమే తమ లక్ష్యమని ప్రకటించింది. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2లక్షల వరకు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లతో బీహార్‌ను ప్రపంచ అభ్యాస కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలిపింది.
Read Also : http://Supreme Court: వీధికుక్కల కేసు.. అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈబీసీలకు రూ.10లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేల పెట్టుబడి సాయం, బీహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు నగరాల్లో (పాట్నా, దర్భంగా, పూర్ణియా, భాగల్పూర్) అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రైలు సేవల ఏర్పాటు, 3,600 కి.మీ రైలు మార్గాలను ఆధునీకరించడం వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత ఎన్నికలు జరగనున్నారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి చరిత్ర?
జాతీయ ప్రజాస్వామ్య కూటమి1998 మే నెలలో జాతీయ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కూటమి అయిన ఐక్య ప్రగతిశీల కూటమిని ఓడించడానికి ఏర్పడింది. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించింది. ఈ కూటమిలో బిజెపితో సహా సమతా పార్టీ, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఇంకా శివసేన ఉన్నాయి, అయితే 2019లో కొన్ని కారణాలవల్ల శివసేన ఈ కూటమి నుండి వైదొలగి కాంగ్రెస్ కూటమిలో చేరింది
జాతీయ ప్రజాస్వామ్య కూటమి నిర్మాణం?
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు కార్యనిర్వాహక బోర్డు లేదా పొలిట్‌బ్యూరో వంటి అధికారిక పాలక నిర్మాణం లేదు. ఎన్నికల్లో సీట్ల భాగస్వామ్యం, మంత్రిత్వ శాఖల కేటాయింపు, పార్లమెంటులో లేవనెత్తిన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం వ్యక్తిగత పార్టీల నాయకుల ఇష్టం. పార్టీల మధ్య విభిన్న సిద్ధాంతాల దృష్ట్యా, మిత్రపక్షాల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు, చీలిక ఓటింగు కేసులు ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: