📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest Telugu News: Bihar: ఎన్​డీఏ- మహాకూటమిలో సీట్ల సర్దుబాటు గొడవలు

Author Icon By Vanipushpa
Updated: October 22, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 255 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపామని విపక్ష ఇండియా (మహా గఠ్​బంధన్) కూటమి ప్రకటించింది. అంటే 12 సీట్లలో విపక్ష కూటమిలోని మిత్రపక్షాలు పరస్పరం ఢీకొంటున్నాయి. వీటిలో కేవలం 4 చోట్ల మిత్రపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నాలుగు సీట్లలో స్నేహపూర్వక పోటీకి సిద్ధమవుతున్నాయి. దీంతో 8 సీట్లలో మహాకూటమి పార్టీలు తలపడం ఖాయమైంది. ఈ క్రమంలో ఇండియా కూటమిలో ఏర్పడిన చీలికకు ఇదే దర్శనమని రాజకీయ పండితులు అంటున్నారు.

Read Also: Microsoft CEO: ఏఐ తో భారీ ప్యాకేజీ అందుకున్న సత్య నాదెళ్ల

Bihar Elections

కాంగ్రెస్‌-సీపీఐ, కాంగ్రెస్‌-ఆర్‌జేడీ అభ్యర్థులు

పలుచోట్ల కాంగ్రెస్‌-సీపీఐ, కాంగ్రెస్‌-ఆర్‌జేడీ అభ్యర్థులు తలపడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌(Prasanth Kishore)కు చెందిన జన్ సురాజ్ పార్టీ నుంచి బరిలోకి దిగిన నలుగురు అభ్యర్థులు చివరి నిమిషంలో నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఈ పరిణామం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు అధికార ఎన్‌డీఏ కూటమి రెబల్స్‌తో నామినేషన్లు విత్‌డ్రా చేయించింది. తద్వారా కూటమిలోని పార్టీల నడుమ ఓట్ల చీలిక జరగకుండా జాగ్రత్తపడింది. ఈనేపథ్యంలో ఎన్నికల సంగ్రామంలో ఏ కూటమి ముందంజలో నిలిచింది?

ఆర్‌జేడీ ఆధిపత్య ధోరణి

మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) తన పంతాన్ని నెగ్గించుకుంది. విపక్ష ఇండియా కూటమిలో అత్యధిక అసెంబ్లీ సీట్లు ఈ పార్టీయే దక్కించుకుంది. 143 స్థానాల్లో ఆర్‌జేడీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లో ఇది దాదాపు 59 శాతానికి సమానం. ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకునే మరోసారి ఆర్‌జేడీ నమ్ముకుంది. తమకు ఆ రెండు వర్గాల మద్దతు లభించి తీరుతుందనే నమ్మకంతో మెజారిటీ సీట్లలో బరిలోకి దిగింది. అయితే ఆర్‌జేడీ ఆధిపత్య ధోరణి ఇండియా కూటమిలోని పలు మిత్రపక్షాలకు నచ్చడం లేదని సమాచారం. అందుకే పలుచోట్ల ఆర్‌జేడీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు, వికాస్‌‌శీల్ ఇన్సాన్ పార్టీ నేతలు నామినేషన్లు వేశారు. ఆయా చోట్ల ఆర్‌జేడీ ఓట్లను ఈ పార్టీలు చీలిస్తే, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థుల విజయ అవకాశాలు పెరిగిపోతాయి. ఆర్‌జేడీ మాత్రం ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటోంది. కొన్నిచోట్ల మిత్రపక్షాలతో తమకు స్నేహపూర్వక పోటీ ఉంటుందని చెప్పుకుంటోంది.

బీహార్ రాజధాని పాత పేరు ఏమిటి?

పాట్నా అసలు పేరు పాటలీపుత్ర లేదా పాటలీపట్టన్ మరియు దాని చరిత్ర క్రీస్తుపూర్వం 600 శతాబ్దం నుండి ప్రారంభమవుతుంది. పాట్నా అనే పేరు దాని ప్రారంభ దశలలో పాటలీగ్రామ్, కుసుంపూర్, పాటలీపుత్ర, అజిమాబాద్ మొదలైన అనేక మార్పులకు గురై, చివరికి ప్రస్తుతానికి ముగుస్తుంది.

పాట్నా ప్రత్యేకత?

వైశాలి, రాజ్‌గిర్, నలంద, బోధ్ గయ మరియు పావాపురి వంటి బౌద్ధ, హిందూ మరియు జైన తీర్థయాత్ర కేంద్రాలు సమీపంలో ఉన్నాయి మరియు పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ ఇక్కడ జన్మించినందున పాట్నా నగరం సిక్కులకు పవిత్ర నగరం . ఆధునిక పాట్నా నగరం ప్రధానంగా గంగా నది దక్షిణ ఒడ్డున ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Coalition Politics Election Strategy India Elections Latest News Breaking News Mahagathbandhan NDA Political Alliance seat sharing Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.